భారత దేశంలో లాక్ డౌన్ మళ్ళీ పొడిగించారు. ఏప్రిల్ 14 తో ముగుస్తుంది అనుకున్న సమయంలో మళ్ళీ మే 3 వరకు పొడిగించారు. ఇందుకు కారణం  ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తున్న క‌రోనా మ‌హమ్మారి వ్యాప్తి చెందుతుండటం వల్ల.

అయితే ఈ క‌రోనా వైరస్ వ్యాప్తి  కారణంగా ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. ఈ వైర‌స్ నియంత్ర‌ణ‌కు చాలా దేశాలు మనకంటే ముందే  లాక్ డౌన్ విధించాయి. అత్యవసర పరిస్థితుల్లో మినహాయించి తప్ప  ప్రజలు ఎవరు తమ ఇళ్ల  నుండి బయటికి రాకూడదని ఆంక్షలు కూడా విధించాయి.

దీంతో ప్రజలంద‌రూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ నేప‌థ్యంలో ప్రజలు త‌మ ఫోన్లకు అంకితం అయ్యారు. ఇంటర్నెట్ వాడకం కూడా బాగా పెరిగింది. ఇక లాక్ డౌన్ వల్ల ఇంట్లో ఖాళీ సమయంలో గేమ్స్, ఇంటర్నెట్, యూట్యూబ్, వీడియొ కాల్స్, చాటింగ్ ఇతర యాప్స్ అత్యధికంగా డౌన్లోడ్ చేస్తున్నారు.

also read  మున్ముందు ఐటీకి కష్టకాలమే! అమెరికాలో కళ తప్పిన సిలీకాన్ వ్యాలీ..

అందులో ఎక్కువగా గేమ్స్, సోషల్ మీడియాకు సంబంధించిన యాప్స్ అధికంగా డౌన్‌లోడ్ చేశారు. ప్రపంచంలోని ప‌లు దేశాల్లో చూస్తే అమెరికాలో సగటున ఒక వారానికి 30 కోట్ల యాప్స్ డౌన్ లోడ్ చేసుకున్నారట, ఇక కరోనా వైరస్ పుట్టిన  చైనాలో 18 కోట్ల యాప్స్ డౌన్ లోడ్ చేస్తే, ఇండియాలో మాత్రం ఏకంగా 38 కోట్ల యాప్స్ డౌన్ లోడ్ చేసుకున్నారు.

అందులో అత్యధికంగా  టిక్ టాక్, వాట్సాప్, ఫేస్ బుక్, షెరిట్, హలో యాప్స్ ఎక్కువగా డౌన్లోడ్ చేసుకున్నారు. ఇక గేమ్స్‌కి సంబంధించిన‌ యాప్స్ లో పబ్జి, క్యాండీ క్రష్, లూడో, క్యారమ్ పుల్, హంటర్ అసాసిన్ అత్యధికంగా డౌన్ లోడ్ చేసుకున్నారు. కొందరు ఇంట్లో పిల్లల కోసం, మరికొందరు వారి వ్యక్తి గత అవసరాలకు యాప్స్ డౌన్ లోడ్ చేసుకున్నారు.