మద్యం దొరక్క ఆఫ్టర్ షేవ్ లోషన్ తో మందుబాబుల పార్టీ: ఇద్దరి మృతి
మందు దొరక్క మందుబాబులు అల్లాడిపోతున్నారు. కొందరైతే పిచ్చి పట్టినట్టు చేస్తున్నారు కూడా. కేరళలో మందు దొరక్క శానిటైజర్ తాగి ఒకరు మరణించిన ఘటన మరువక ముందే, తమిళనాడులో కూల్ డ్రింక్ లో ఆఫ్టర్ షేవ్ లోషన్ కలుపుకొని తాగి ఇద్దరు మరణించారు.
కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. లాక్ డౌన్ కొనసాగుతుండడంతో నిత్యావసరాలు మినహా వేరేవేమి దొరకడం లేదు. అన్నిటితోపాటే మద్యం కూడా దొరకకపోతుండడంతో మందుబాబులు కుదేలవుతున్నారు.
మందు దొరక్క మందుబాబులు అల్లాడిపోతున్నారు. కొందరైతే పిచ్చి పట్టినట్టు చేస్తున్నారు కూడా. కేరళలో మందు దొరక్క శానిటైజర్ తాగి ఒకరు మరణించిన ఘటన మరువక ముందే, తమిళనాడులో కూల్ డ్రింక్ లో ఆఫ్టర్ షేవ్ లోషన్ కలుపుకొని తాగి ఇద్దరు మరణించారు.
అందులోకూడా ఉండేది ఆల్కహాల్ ఏ అని ఎవరో చెబితో ఈ యువకులు తాగారట. నలుగురు యువకులు తాగగాఅందులో ఇద్దరు మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తమిళ్ నాడులోని పుదుకోట్టై జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన వల్ల ఒక్కసారిగాజిల్లా అంతా ఉలిక్కిపడింది.
Also Read కర్ణాటకలో మరో కరోనా మరణం: నాలుగుకు చేరిన మృతుల సంఖ్య...
ఇప్పటికే మందుబాబులు తమకు మందు దొరకడం లేదని ప్రభుత్వాన్ని వేడుకొని క్షణం లేదు. సోషల్ మీడియాలో అయితే దీనిమీద ట్రోలింగ్ ఏ విధంగా జరుగుతుందో వేరుగా చెప్పనవసరం లేదు.
మందుబాబులు ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ మందు దొరక్క విలవిల్లాడుతున్నారు. ఊళ్లలో అయితే నాటుసారా గుడుంబా, కల్లు ఏదైనా సరే కిక్కే లక్ష్యం అన్నట్టుగా తాగేస్తున్నారు. హైద్రాబాద్ లో మందు దొరక్క ఒక మందుబాబు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఏకంగా మందుబాబులు మందు షాపులకు కన్నాలు వేయడానికి కూడా వెనకాడడం లేదు.
ఇటువంటి సంఘటనలు రెండు మూడు చోటు చేసుకున్నాయి కూడా. ఇక ఊర్లలోనయితే ఉదయం నుండే కల్లు కోసం క్యూలు కడుతున్నారు. ఈత కల్లు తాటి కల్లు అని తేడా లేకుండా ఏదైనా సరే నషా ఎక్కితే చాలన్నట్టుగా మీదపడి తాగేస్తున్నారు. సాధారణంగా 20 రూపాయలుండే సీసా ఇప్పుడు 50 రూపాయలకు చేరుకుంటుంది.
ఇకపోతే తెలంగాణలో మద్యం షాపులను మద్యాహ్నం ఒక రెండున్నర గంటల పాటు తెరిచి ఉంచుతామని చెప్పే ఒక ఫేక్ సర్కులర్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఈ ఫేక్ న్యూస్ ను కూడా మందు బాబులు తెగ షేర్ చేస్తున్నారు. అందులో గ్రామర్ ను బట్టి చూస్తే ఇదేదో ప్రాంక్ అని ఇట్టే తెలిసిపోతుంది. కానీ మందుబాబుల మద్యం లవ్ వారిని కనీసం ఆ పోస్టును పూర్తిగా కూడా చదవనివ్వడంలేదు. చదువొచ్చినవారు, చదువు రానివారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్క మందు లవర్ దాన్ని ఫార్వర్డ్ చేసాడు.
సోషల్ మీడియా గ్రూపుల్లో నెలరోజులపాటు మందు కొనుక్కొని పెట్టుకోవాలని తెగ చర్చలు కూడా పెడుతున్నారు. ఇలా మందుబాబులకు ఒక్కసారిగా ఇది ఫేక్ న్యూస్ అని తెలియగానే తెగ బాధపడిపోతున్నారు.
ఇకపోతే ఊళ్లలో కల్తీ మందు కూడా ఏరులై పారుతుంది. నాటుసారా, గుడుంబా అనే తేడా లేకుండా దానికోసం జనం ఎగబడుతున్నారు. ఫారిన్ మందులు మాత్రమే తాగే మందుబాబులు కూడా ఇప్పుడు చీప్ లిక్కర్ దొరికినా చాలు అని అనుకుంటున్నారు.