డ్యూటీయే ప్రాణం.. పై అధికారులు వద్దంటున్నా: 450 కిలోమీటర్లు నడిచిన కానిస్టేబుల్

కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశంలో లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఎక్కడికక్కడ రవాణా సదుపాయాలు నిలిచిపోవడంతో ప్రజలు ఓ చోటి నుంచి మరో చోటికి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు

Lock Down: police constable walks 450 kms join duty in madhya pradesh

కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశంలో లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఎక్కడికక్కడ రవాణా సదుపాయాలు నిలిచిపోవడంతో ప్రజలు ఓ చోటి నుంచి మరో చోటికి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఈ మధ్యకాలంలో కొందరు అభాగ్యులు వందల కిలోమీటర్ల దూరం నడిచి గమ్యస్థానాలకు చేరుకుంటున్న ఘటనలు జాతిని ఆవేదనకు గురిచేస్తున్నాయి. అయితే తాజాగా ఓ పోలీస్ కానిస్టేబుల్ తన విధులు నిర్వర్తించేందుకు ఏకంగా 450 కిలోమీటర్లు నడిచి ఔరా అనిపించుకున్నాడు.

వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల దిగ్విజయ్ శర్మ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. డిగ్రీ పరీక్షల నిమిత్తం ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాకు వెళ్లిన అతడు సెలవులో ఉన్నాడు.

Also Read:కరోనా: వలస కార్మికుల కోసం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

అయితే కరోనా కారణంగా పరీక్షలు వాయిదా పడటంతో దిగ్విజయ్ తిరిగి విధుల్లో హాజరవుతానని పై అధికారులకు సమాచారం అందించాడు. అయితే రవాణా సౌకర్యాలు లేకపోవడంతో ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవాలని పై అధికారులు సూచించారు.

దీనికి ససేమిరా అన్న దిగ్విజయ్ ఎలాగైనా డ్యూటీకి వెళ్లాల్సిందేనని బలంగా నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా మార్చి 25న ఉదయం కాలినడకన ఇటావా నుంచి బయల్దేరాడు.

మధ్య మధ్యలో కొన్నిసార్లు ఎవరొకరి వద్ద లిఫ్ట్ తీసుకుంటూ, నడుచుకుంటూ వెళ్లాడు. సుమారు 20 గంటల ప్రయాణం తర్వాత ఎట్టకేలకు మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్‌కు చేరుకున్నాడు.

Also Read:వారిని కాల్చి చంపాల్సిందే: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు

అయితే మార్గమధ్యంలో దిగ్విజయ్ ఎలాంటి ఆహారాన్ని తీసుకోలేదు. తాము వద్దని వారించినా డ్యూటీ చేసేందుకు అంత దూరం ప్రయాణించిన అతనిని పై అధికారులు మెచ్చుకున్నారు. కాలినడకన వచ్చినందున కాస్త విశ్రాంతి తీసుకోమని అధికారులు చెప్పినప్పటికీ.. తాను మాత్రం వెంటనే విధుల్లో చేరతానని దిగ్విజయ్ పట్టుబట్టడం విశేషం.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios