వారిని కాల్చి చంపాల్సిందే: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ నిజాముద్దీన్ కి వెళ్లివచ్చి వైద్య పరీక్షలకు సహకరించనివారిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలా వైద్య పరీక్షలకు సహకరించనివారిని కాల్చి చంపాలని డిమాండ్ చేశారు
తెలంగాణలో ఆరుగురు వ్యక్తులు కరోనా వైరస్ బారిన పడి మరణించినట్టు తెలిసిందే. మార్చ్ 13-15 మధ్య ఢిల్లీ నిజాముద్దీన్ పరిధిలోని మర్కజ్ లో మత పరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా సోకింది. వారిలో తెలంగాణకు చెందిన నలుగురు మరణించారని నిన్న రాత్రి తెలంగాణ సర్కార్ అధికారికంగా ధృవీకరించింది. గాంధి ఆసుపత్రిలో ఇద్దరు, అపోలో ఆసుపత్రి, గ్లోబల్ ఆసుపత్రి, నిజామాబాద్, గద్వాలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారని తెలిపింది.
వీరి ద్వారా కరోనా సోకే అవకాశం ఉందని అనుమానిస్తున్న వారందరిని ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు గుర్తించి, ఆసుపత్రులకు తరలిస్తున్నాయని, ఈ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరు తమంతట తాముగా, విధిగా సమాచారాన్ని అధికారులకు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
also Read: ఏపీపై కరోనా పంజా: ఒక్క రోజే 17 పాజిటివ్ కేసులు, మొత్తం 40కి చేరిక
ఇలా ఢిల్లీ నిజాముద్దీన్ కి వెళ్లివచ్చి వైద్య పరీక్షలకు సహకరించనివారిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలా వైద్య పరీక్షలకు సహకరించనివారిని కాల్చి చంపాలని డిమాండ్ చేశారు. లేకపోతే వైరస్ మరింత మందికి వ్యాపించే అవకాశం ఉందని, అది మరింత ప్రమాదానికి దారితీస్తుందని ఆయన ప్రభుత్వాలను హెచ్చరించారు.
ఇలా అక్కడ మతపరమైన ప్రార్థనల్లో పాల్గొని వచ్చినవారు దాదాపుగా 6 రాష్ట్రాల మంది ఉన్నారని, వారందరిని ఆయా ప్రభుత్వాలు గుర్తించాలని ఆయన డిమాండ్ చేసారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సహా అన్ని రాష్ట్రప్రభుత్వాలు ఈ దిశగా తక్షణం చర్యలను చేపట్టాలని ఆయన సూచించారు.
ఈ సభ జరిగే నాటికే కరోనా ముప్పు ఉందని, ఈ సభలో ఇండోనేషియా సహా విదేశాల మనుషులు ఎలా వచ్చారని రాజా సింగ్ నిలదీశారు. అరవింద్ కేజ్రీవాల్ ఎలా ఈ సభకు అనుమతినిచ్చారని ఆయన సూటిప్రశ్నను సంధించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను రిలీజ్ చేసారు.
ఇకపోతే తెలంగాణలో ఆరు కరోనా మరణాలు నమోదయ్యాయి. ఈ నెల 13 నుంచి 15 వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ లో మత పరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా వైరస్ సోకింది.
అందులో తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారు. వారిలో ఇప్పటి వరకు ఆరుగురు మరణించారు. ఇద్దరు గాంధి ఆసుపత్రిలో, ఒకరు అపోలో ఆసుపత్రిలో, ఒకరు గ్లోబల్ ఆసుపత్రిలో, ఒకరు నిజామాబాద్ లో, ఒకరు గద్వాలలో మరణించారు. వీరి ద్వారా వైరస్ సోకే అవకాశం ఉందని భావిస్తున్న అనుమానితులను ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు గుర్తించి, ఆసుపత్రులకు తరలిస్తున్నాయి.
వారికి పరీక్షలు నిర్వహించి, వైద్యం అందిస్తున్నారు. మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తున్నది కాబట్టి, ఈ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరు విధిగా తమ సమాచారాన్ని అధికారులకు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తున్నది.
వారికి ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించి, ఉచితంగా చికిత్స కూడా అందిస్తుంది. కాబట్టి మర్కజ్ వెళ్ళి వచ్చిన వారంతా తప్పక అధికారులకు సమాచారం అందించాలి. వారి గురించి ఎవరికి సమాచారం తెలిసినా వెంటనే ప్రభుత్వానికి తెలియ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ కోరుతున్నది..
దీనిపై పోరాటం చేయాలనీ వారు భావిస్తున్నారు. మరోపక్క సర్కారేమో దేశం తోపాటుగా తెలంగాణ కూడా లాక్ డౌన్ లో ఉంది. దేశంలో ఎటువంటి ఉత్పాదక పనులు జరగకపోవడంతో అటు దేశం పైన, ఇటు రాష్ట్రాల పైన అధిక భారం పడుతోంది. సాధారణ పరిపాలనతోపాటుగా కరోనా నివారణ, సహాయక చర్యలు పెద్ద ఎత్తున సాగుతుండడంతో ఆర్థికంగా తీవ్రమైన భారాన్ని మోస్తున్నాయి.