Asianet News TeluguAsianet News Telugu

గూగుల్ పే..ఆర్‌బిఐకి హైకోర్టు నోటీసు..యుపిఐ పేమెంట్ నిలిపివేయాలని పిటిషన్...

గూగుల్ ఇండియా డిజిటల్ సర్వీసు యుపిఐ కార్యకలాపాలను నిలిపివేయాలని  దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కేంద్రం, రిజర్వ్ బ్యాంక్‌కు నోటీసు జారీ చేసింది.

high court issued notice to Centre and Reserve Bank of India
Author
Hyderabad, First Published May 15, 2020, 6:10 PM IST

న్యూ ఢిల్లీ: కేంద్రం, ఆర్‌బీఐ మార్గదర్శకాలను పూర్తిగా పాటించే వరకు గూగుల్ ఇండియా డిజిటల్ సర్వీసు యుపిఐ కార్యకలాపాలను నిలిపివేయాలని  దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కేంద్రం, రిజర్వ్ బ్యాంక్‌కు నోటీసు జారీ చేసింది.

జస్టిస్ ఆశా మీనన్ సింగిల్ జడ్జి బెంచ్, ఈ రోజు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన ఉత్తర్వులో, గూగుల్ ఇండియాకు నోటీసు జారీ చేసింది. పిటిషనర్ తరఫు న్యాయవాదికి ముందస్తు కాపీలతో మూడు వారాల్లోపు రిప్లై పిటిషన్ దాఖలు చేయాలని వారిని ఆదేశించింది. 


అలాగే గూగుల్‌ పే ఇండియా యాజమాన్యంపై భారీ జరిమానా విధించాలని కోరారు. సరైన మార్గదర్శకాలు పాటించే వరకు గూగుల్‌ పే యాప్‌ ద్వారా యూపీఐ సేవలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఆర్‌బీఐ ఆదేశాలకు అనుగుణంగా గూగుల్‌ పే యాప్‌ పనిచేస్తుందో, లేదో తెలుసుకోవడానికి స్వతంత్ర విచారణ జరిపించాలని కూడా కోరారు.

also read వివో స్మార్ట్ ఫోన్..పై కొత్త లోగో డిజైన్ ...

"పిటిషనర్ కరోనా వైరస్ మహమ్మారి బారిన పడ్డ వారికోసం పిఎమ్ కేర్స్ ఫండ్‌కి విరాళం 'గూగుల్ పే' ద్వారా చెయాలనుకున్నాడు. పిటిషనర్‌ను  పిఎమ్ కేర్స్ ఫండ్‌కి విరాళం చేయనివకుండా బ్యాంకు ఖాతా వివరాలను అడుగుతుందని, గూగుల్ పే మరొక వి‌పి‌ఏ/ యూ‌పి‌ఐ ఐ‌డిని తప్పనిసరిగా క్రియేట్ చేసుకోమని చూపిస్తుందని పిటిషన్లో తెలిపాడు.

ఇది మార్కెట్ వాటాను పెంచుకోవడానికి బ్యాంకు ఖాతా వివరాలను అడుగుతుందని, వినియోగదారులను చెల్లింపులు చేయకుండా పరిమితం చేస్తోంది, దాని వినియోగదారు డేటా బేస్ పెంచడానికి కోవిడ్ -19 పరిస్థితులను అనవసరంగా ఉపయోగించుకుంటుందని పిటిషన్లో ఆరోపించాడు.

తాజాగా ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు.. రిప్లై పిటిషన్‌ దాఖలు చేయాలని కేంద్రం, ఆర్‌బీఐ, గూగుల్‌ పే ఇండియాను కోరింది. గూగుల్‌ ఇండియా డిజిటల్‌ సర్వీసెస్‌ తరఫున నోటీసులు స్వీకరించిన లాయర్‌ అఖిల్‌ ఆనంద్‌.. రిప్లై పిటిషన్‌ దాఖలు చేసేందకు మూడు వారాల గడువు కోరారు. ఇందుకు న్యాయస్థానం సమ్మతించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios