వివో స్మార్ట్ ఫోన్..పై కొత్త లోగో డిజైన్ ...

లోగోలో 'మేక్ ఇన్ ఇండియా' డిజైన్‌ జోడించింది వివో స్మార్ట్ ఫోన్ కంపెనీ. వివో గత ఏడాది భారతదేశంలో మొబైల్ పరికరాల తయారీకి రూ .7,500 కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపింది.

vivo smart phone new logo with make in india design

స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో తమ స్మార్ట్ ఫోన్ లోగో డిజైన మార్పు చేసింది. తాజాగా గురువారం నాడు 'మేక్ ఇన్ ఇండియా' డిజైన్‌ను జోడించి తన కొత్త లోగోను వెల్లడించింది. ఇది భారతదేశంలో విక్రయించబోయే అన్ని స్మార్ట్ ఫోన్‌ల బాక్సులపై కొత్త లోగో ముద్రించనుంది.

వివో గత ఏడాది భారతదేశంలో మొబైల్ పరికరాల తయారీకి రూ .7,500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. "వివో ఇండియాలో మొదటి నుండి 'మేక్ ఇన్ ఇండియా'కి అనుగుణంగా ఉన్నాము.

"మా రాబోయే అన్ని స్మార్ట్ ఫోన్  డివైజెస్  బాక్సులపై ముద్రించబోయే కొత్త లోగో డిజైన్ భారతదేశాన్ని ఉత్పాదక కేంద్రంగా మార్చాలని, మా కంపెనీ మేక్‌ ఇన్‌ ఇండియా నిబద్ధతకు జీవం పోస్తూ, అంతర్జాతీయంగా స్థానిక సంస్థగా ఉండాలనే మా లక్ష్యాన్ని పునస్థాపించింది" అని వివో ఇండియా బ్రాండ్ స్ట్రాటజీ డైరెక్టర్ నిపున్ మరియా ఒక ప్రకటనలో తెలిపారు .

భారతదేశంలో వివో విక్రయించే అన్ని స్మార్ట్ ఫోన్లు నోయిడా ఫ్యాక్టరీలో తయారుకానున్నాయి.

also read  వరుస హ్యాట్రిక్ తరువాత జియో మరో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్...

వివో ఇండియా గత ఏడాది భారతదేశాన్ని ఉత్పాదక కేంద్రంగా మార్చడానికి వివో సంస్థ  మెక్ ఇన్ ఇండియా డిజైన్లను ఆహ్వానిస్తూ ఒక పోటీని ప్రకటించింది. ఇందులో విజేతగా నిలిచిన ముంబైకి చెందిన రాహుల్ పటేల్ లోగోను రూపొందించారు. టాలెంట్‌హౌస్ ఇండియా (రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ విభాగం) పై క్రౌడ్ సోర్స్ చేశారు.

వివో గతేడాది పెట్టుబడి విషయంలో  రూ .4 వేల కోట్లు అని తెలిపినప్పటికి ఇప్పుడు తాజాగా రూ .7,500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది.

రాబోయే పదేళ్లలో 40వేల ఉద్యోగాలను కూడా సృష్టించే లక్ష్యంతో దశలవారీగా పెట్టుబడులు పెడతామని వివో ఇండియా బ్రాండ్ స్ట్రాటజీ డైరెక్టర్ నిపున్ మరియా చెప్పారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios