లాక్ డౌన్ ముగింపా..?కొనసాగింపా..? తేలేది ఆ రోజే..
ఈ కాన్ఫెరెన్స్ లోనే తుది నిర్ణయం తీసుకుంటారని ఢిల్లీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో ఉన్న క్షేత్ర స్థాయి పరిస్థితులు, కరోనా వైరస్ సంఖ్య తదితర ముఖ్య విషయాలు మోదీ వారితో చర్చించనున్నారు. అన్ని రాష్ట్రాల్లోని క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకున్న తర్వాతే ప్రధాని తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ భారత్ కి కూడా పాకేసింది. రోజు రోజుకీ దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ ఉన్నప్పటికీ కేసులు పెరుగుతున్నాయి. మరో వారంలో ఈ లాక్ డౌన్ ముగియ నుంది. ఈ క్రమంలో.. మళ్లీ లాక్ డౌన్ ని కొనసాగిస్తారా.. లేదంటే ఇంతటితో ముగింపు పలుకుతారా..? ప్రభుత్వం మనసులో ఏముందనే విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది.
వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం లాక్‌డౌన్ ఉండాలని సూచిస్తున్నప్పటికీ ప్రధాని మోదీ మాత్రం దీనిపై నోరు మెదపడం లేదు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం శనివారం ప్రధాని మోదీ లాక్‌డౌన్ పొడగింపుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ శనివారం రెండోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
Also Read కరోనాఎఫెక్ట్ :హిందూ మహిళ మృతి, పాడె మోసిన ముస్లింలు...
ఈ కాన్ఫెరెన్స్ లోనే తుది నిర్ణయం తీసుకుంటారని ఢిల్లీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో ఉన్న క్షేత్ర స్థాయి పరిస్థితులు, కరోనా వైరస్ సంఖ్య తదితర ముఖ్య విషయాలు మోదీ వారితో చర్చించనున్నారు. అన్ని రాష్ట్రాల్లోని క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకున్న తర్వాతే ప్రధాని తుది నిర్ణయం తీసుకోనున్నారు.
అయితే ఢిల్లీ వర్గాల సమాచారం మాత్రం ఆర్థిక పరిస్థితి తిరిగి పుంజుకోడానికి వివిధ దశల్లో ఆంక్షలను ఎత్తేయడానికి సుముఖంగానే ఉందని అభిప్రాయపడుతున్నారు. నిరుద్యోగం, ఆర్థిక రంగం కుదేలవుతోందని అందరూ భావిస్తున్న విషయం తెలిసిందే.
మరోవైపు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన జీవోఎం సమావేశంలో మాత్రం కేంద్ర మంత్రులు కొన్ని కీలక సూచనలు చేసినట్లు సమాచారం. పంటల కోతకు అనుమతించడంతో పాటు నిత్యావసర వస్తువుల దుకాణాలకు అనుమతించాలని భావించినట్లు సమాచారం.
ఫుడ్‌కోర్టులు, రెస్టారెంట్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవొద్దని వారు అభిప్రాయపడ్డారు. రైళ్లు, బస్సులు, మెట్రో సేవలను కూడా మరి కొన్ని రోజుల పాటు మూసే ఉంచాలని సూచించారు. విమాన ప్రయాణాలను మాత్రం దశల వారీగా ప్రారంభిస్తే బాగుంటుందని భావించినట్లు సమాచారం.
వీటన్నింటి దృష్ట్యా శనివారం అన్ని రాష్ట్రాల సీఎంలతో నిర్వహించబోయే సమావేశాల్లోనే మోదీ తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం.