ముంబై: మీరు బంగారం కొనుగోలు చేయాలని తలపోస్తున్నారా? అయితే ఒక్కనిమిషం.. బంగారం ధరలు భగ్గుమనబోతున్నాయి. ఒకవైపు ఆర్థిక మాంద్యం బుసలు కొడుతుంటే మరోవైపు కరోనా వైరస్‌ రక్కసి రోజురోజుకు విస్తరిస్తుండటంతో మదుపరుల్లో ఆందోళన తీవ్రస్థాయికి చేరుకున్నది.

స్టాక్‌ మార్కెట్లు కుదేలవుతుండటంతో మదుపర్లు తమ పెట్టుబడులు సురక్షితమైన అతి విలువైన లోహాలవైపు మళ్లిస్తుండటంతో వీటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి బంగారం ధరలు రూ.50 వేల నుంచి రూ.55 వేల మధ్యలోకి చేరుకోనున్నాయని బులియన్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2

019లో 23.74 శాతం రిటర్నులు పంచిన బంగారం..ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో పదిగ్రాముల ధర రూ.6,794 లేదా 17.31 శాతం ఎగబాకింది. ఇప్పటి వరకు 15.19 శాతం రిటర్నులు పంచింది. కరోనా వైరస్‌ దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుండటంతో వచ్చే రెండు నుంచి మూడేళ్ల వరకు బంగారం మరింత ప్రియమయ్యే అవకాశాలున్నాయని  పీఎన్‌జీ జువెల్లరీ ఎండీ సౌరభ్‌ గాడ్గిల్‌ తెలిపారు.

also read బంగారం ధరల్లో రికార్డుల మోత... 10గ్రాముల బంగారం ధర..

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర కనీసం 2000 డాలర్లను తాకుతుందని సౌరబ్ గాడ్గిల్ తెలిపారు. సగటున భారత రిటైల్ మదుపరి వద్ద ప్రస్తుతం 10-15 శాతం పసిడి ఉంది. ఇది వచ్చే రెండేళ్లలో 30 శాతానికి చేరుతుందని అంచనా.

ప్రపంచవ్యాప్తంగా ఏదైనా యుద్ధం లేదా సంక్షోభం జరిగిన వెంటనే పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ప్రత్యామ్నాయమైన పసిడి వైపు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 20 నుంచి సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను విక్రయించడానికి సిద్ధమైంది. 

2019లో 24 శాతం మేర పరుగులు పెట్టిన పసిడి ఈ ఏడాది కూడా అదే జోరు కొనసాగించొచ్చని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులపై నెలకొన్ని ఆందోళనలు ఇందుకు దోహదపడతాయని పేర్కొన్నారు 

ఏడేండ్ల గరిష్ఠానికి ఔన్స్‌ 
అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం మండుతున్నది. న్యూయార్క్‌ బులియన్‌ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ ధర ఏడేళ్ల గరిష్ఠ స్థాయి 1,715.25 డాలర్లు పలికింది. డిసెంబర్‌ 2012లో నమోదైన 1,722 డాలర్ల  తర్వాత ఇదే గరిష్ఠ స్థాయి ధరలు. అమెరికా గోల్డ్‌ ఫ్యూచర్‌లో 1,770. 20 డాలర్లుగా ట్రేడ్‌ అవుతున్నది.