Asianet News TeluguAsianet News Telugu

బంగారం ధరల్లో రికార్డుల మోత... 10గ్రాముల బంగారం ధర..

మంగళవారం గోల్డ్ ధరలు రికార్డు స్థాయిని చేరుకున్నాయి. ఎంసీఎక్స్ మార్కెట్లో రూ.46,179లకు చేరుకున్న పసిడి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ ధర 1681.49 డాలర్లకు చేరింది.
 
Gold Price In India Surpasses Rs 46,000 Mark; What Is Driving The Surge?
Author
Hyderabad, First Published Apr 14, 2020, 1:01 PM IST
ముంబై: కరోనా వైరస్ మహమ్మారి వల్ల భౌతికంగా కొనుగోళ్లు లేకపోయినా బంగారం ధరలు మంగళవారం కూడా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్‌లో పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర రూ.46 వేలు దాటింది. 

ఎంసీఎక్స్ మార్కెట్లో రూ.46,179లకు చేరుకున్నది.అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 1681.49 డాలర్లకు చేరుకున్నది. గోల్డ్ ఫ్యూచర్స్ ధర 1728.40 డాలర్ల స్థాయికి చేరుకున్నది. 

మరోవైపు ఢిల్లీలో 916 ప్యూరిటీ గోల్డ్ ధర రూ.550 పెరిగి రూ.43,120కి చేరుకోగా, 10 గ్రాముల బంగారం ధర రూ.45,120లకు చేరింది. అంతర్జాతీయంగా పసిడి ధరలు ఏడేళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ వల్ల భౌతికంగా కొనుగోళ్లు పడిపోయినా బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. 

భారతదేశంలో బంగారం ధరలు ఫ్యూచర్ మార్కెట్లలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి.  సోమవారం  ఒక శాతానికిపైగా పుంజుకున్నాయి. ఎంసీఎక్స్ మార్కెట్‌లో జూన్ పసిడి ఫ్యూచర్స్ 10 గ్రాములకు 45,800కు చేరుకుంది.

మరోవైపు వెండి కూడా ఇదే బాటలో వుంది. మే నెల వెండి ఫ్యూచర్స్ కిలోకు 0.4 శాతం పెరిగి 43,670కు చేరుకుంది. బంగారం ధరలు పెరిగే అవకాశం ఎక్కువ కనిపిస్తోందని, మొత్తం ధోరణి సానుకూలంగా ఉందని ఎస్‌ఎంసి గ్లోబల్ ఒక నోట్‌లో పేర్కొంది.

బంగారానికి  పది గ్రాముల ధర రూ. 45 వేల దగ్గర, వెండి  కిలో ధర  42,500  రూపాయల వద్ద గట్టి మద్దతు వుందని తెలిపింది.

గ్లోబల్ మార్కెట్లలో సోమవారం బంగారం రేట్లు ఫ్లాట్ గా ఉన్నప్పటికీ ఒక నెల గరిష్ట స్థాయి వద్ద స్థిరంగా ఉన్నాయి.  కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తి  నేపథ్యంలో గత వారం యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ప్రకటించిన, తాజా ఉద్దీపన చర్యలతో ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు, బంగారానికి మద్దతు ఇస్తున్నాయని నిపుణుల అంచనా.

also read  ఆర్‌బి‌ఐని వెంటాడుతున్న ‘కరోనా వైరస్‌’:ఆర్థిక మాంద్యం మనల్ని వదలదన్న దాస్

స్పాట్ బంగారం ఔన్సు1,687 డాలర్లుగా ఉంది. ఇతర విలువైన లోహాలలో, వెండి 0.5శాతం పెరిగి 15.40 డాలర్ల వద్ద,, ప్లాటినం 0.3శాతం క్షీణించి 745.74 డాలర్లకు చేరుకుంది.  లాక్ డౌన్ పొడిగింపుపై అనిశ్చితి వల్ల జ్యువెలర్స్ మే డెలివరీకి కూడా ఆర్డర్లు ఇవ్వడం లేదని ముంబై బులియన్ డీలర్లు తెలిపారు. రికార్డు ధరలు, లాక్ డౌన్‌తో మార్చిలో భారత బంగారు దిగుమతులు సంవత్సరానికి 73శాతం పడిపోయిన సంగతి తెలిసిందే.

గత ఆర్థిక సంవత్సరం (2019-20)లో మాత్రం గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు పెరిగాయి. ఇందుకు కారణం కరోనా వైరస్‌ వ్యాప్తి మూలంగా ఏర్పడిన ఆందోళనలే. తమ పెట్టుబడులకు బంగారం రక్షణనిస్తుందన్న విశ్వాసంతో ఇన్వెస్టర్లు బంగారాన్ని నమ్ముకున్నారు. అందుకే పెట్టుబడుల్లో జోరు పెరిగింది.  2020 మార్చి నాటికి బంగారం ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) 79 శాతం పెరిగి 7,949 కోట్లకు చేరుకున్నాయి. 2019 మార్చి చివరినాటికి ఇవి రూ.4,447 కోట్లుగా ఉన్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి

2019-20లో ఇన్వెస్టర్లు నికరంగా 14 గోల్డ్‌ లింక్డ్‌ ఈటీఎఫ్‌లలో రూ.1,613 కోట్ల పెట్టుబడులు పెట్టారు. 2019-20లో మదుపర్లు రూ.412 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. 2017-18లో రూ.835 కోట్లు, 2016-17లో రూ.775 కోట్లు, 2015-16లో రూ.903 కోట్లు, 2014-15లో 1,475 కోట్లు, 2013-14లో రూ.2,293 కోట్ల పెట్టుబడులను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. అయితే 2012-13లో మాత్రం రూ.1,414 కోట్ల పెట్టుబడులు పెట్టారు.
Follow Us:
Download App:
  • android
  • ios