రికార్డు స్ధాయిలో భగ్గుమన్న బంగారం ధరలు...10 గ్రాముల ధర..?
హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ ప్రకారం, కరోనా వైరస్ (కోవిడ్ -19) వ్యాప్తిని అరికట్టేందుకు చేస్తున్న చెర్యల్లో భాగంగా,కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి కేసులను గుర్తించే తనిఖీలో భాగంగా దేశంలో లాక్ డౌన్ కారణంగా స్పాట్ బంగారు మార్కెట్లు మూసివేయబడ్డాయి.
న్యూ ఢిల్లీ: వేగంగా పెరుగుతున్న కరోనా వైరస్ (కోవిడ్ -19) కేసులు, అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం బంగారం, వెండి ధరలు పెరిగాయి. యుఎస్, జపాన్ నుండి పేలవమైన ఆర్థిక డేటా కూడా విలువైన లోహాల ధరల పెరుగుదలకు సహాయపడింది.
జనవరిలో కుదిరిన యుఎస్-చైనా "ఫేజ్ 1" వాణిజ్య ఒప్పందం విచ్ఛిన్నం కాకపోవడం, అలాగే దీనిని అమలు చేయడానికి ఇరు దేశాలు ఇంకా కృషి చేస్తున్నాయని వైట్ హౌస్ ఉన్నత ఆర్థిక సలహాదారు శుక్రవారం చెప్పారు, అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తానకు ఈ ఒప్పందం ఆశ్చర్యం కలిగించలేదన్నారు.
చైనాపై డొనాల్డ్ ట్రంప్ విమర్శలతో చెలరేగడం, బీజింగ్ దీటుగా ప్రతిస్పందిస్తుండటంతో అనిశ్చితి వాతావరణం మదుపరులను బంగారం వైపు ఆకర్షిస్తోంది.
మరోవైపు ఈక్విటీ మార్కెట్లు కుదేలవడంతో పసిడిపై పెట్టుబడులకు మదపరులు ఆసక్తి కనబరుస్తున్నారు. బంగారు ఫ్యూచర్స్ ప్రకారం బంగారం 0.58 శాతం అంటే 275 రూపాయలు పెరిగి 10 గ్రాముల ధర 47,656 రూపాయలకు చేరుకుంది. సిల్వర్ ఫ్యూచర్స్ ప్రకారం వెండి 2.88 శాతం అంటే రూ .1347 పెరిగి కిలో ధర రూ .48,065 కు చేరుకుంది.
కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి కేసులను గుర్తించే తనిఖీలో భాగంగా దేశంలో లాక్ డౌన్ కారణంగా స్పాట్ బంగారు మార్కెట్లు మూతపడ్డాయని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ తెలిపింది.
also read స్వీగ్గి షాకింగ్ న్యూస్: ఉద్యోగుల తొలగింపు.. క్లౌడ్ కిచెన్స్ మూసివేత..
ప్రపంచవ్యాప్తంగా, యు.ఎస్-చైనా దేశాల సంబంధాల గురించి ఆందోళన చెందడం, యుఎస్ ఆర్థిక డేటా అస్పష్టంగా ఉన్నందున, 2012 అక్టోబర్ నుండి బంగారం ధర అత్యధికంగా పెరిగి రికార్డు స్థాయికి చేరుకుంది. స్పాట్ బంగారం ఔన్సుకు 0.9 శాతం పెరిగి 1,756.79డాలర్ల వద్ద ఉంది, ఇది అక్టోబర్ 12, 2012 నుండి ఇది అత్యధిక పెరుగుదల.
గత వారం చాలా వరకు ఆసియాలోని ముఖ్య కేంద్రాల్లో భౌతిక బంగారం డిమాండ్ బాగా ఉంది.ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్ అయిన ఎస్పీడిఆర్ గోల్డ్ ట్రస్ట్ హోల్డింగ్స్ శుక్రవారం 0.8 శాతం పెరిగి 1,113.78 టన్నులకు చేరుకుంది.
పల్లాడియం ధర 0.5 శాతం పడిపోయి ఔన్సుకు 1,892.25 డాలర్లకు చేరుకుంది. ప్లాటినం ధర 0.7 శాతం పెరిగి 803.19 డాలర్లకు చేరుకోగా, వెండి ధర 2 శాతం పెరిగి 16.96 డాలర్లకు చేరుకుంది.