స్వీగ్గి షాకింగ్ న్యూస్: ఉద్యోగుల తొలగింపు.. క్లౌడ్ కిచెన్స్‌ మూసివేత..

స్వీగ్గి ఉద్యోగి నోటీసు వ్యవధి మూడు నెలలు, వారు సంస్థతో ఐదేళ్ళు గడిపినట్లయితే వారికి ఎనిమిది నెలల జీతం లభిస్తుంది అని స్విగ్గి చెప్పారు.  తొలగించిన వారికి వీడియో కాల్స్‌ ద్వారా కంపెనీ ఈ విషయాన్ని తెలియజేస్తుంది.

Swiggy on Monday announced to lay off 1,100 employees

న్యూ ఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ  కంపెనీ స్వీగ్గి వ్యాపారం పై తీవ్రమైన ప్రభావం పడింది. దీంతో ముఖ్యమైన నగరాలు, ప్రధాన కార్యాలయాలలో గ్రేడ్లలో ఉన్న 1,100 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గి సోమవారం ప్రకటించింది.

ప్రభావిత ఉద్యోగులందరికీ వారి నోటీసు వ్యవధి లేదా పదవీకాలంతో సంబంధం లేకుండా కనీసం మూడు నెలల జీతం అందుతుందని, స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు, సిఇఒ శ్రీహర్ష మెజెటి వర్చువల్ టౌన్ హాల్ సమావేశంలో ఉద్యోగులకు చెప్పారు.

"వారు మా సంస్థతో గడిపిన ప్రతి సంవత్సరం, మేము వారి నోటీసు వ్యవధికి అదనంగా అదనపు నెల ఎక్స్-గ్రేటియాను అందిస్తాము, పదవీకాలాన్ని బట్టి 3-8 నెలల జీతం అదనంగా ఇస్తాము" అని మెజెట్టి చెప్పారు.

ఒకరు నోటీసు వ్యవధి మూడు నెలలు ఇంకా వారు సంస్థతో ఐదేళ్ళు గడిపినట్లయితే, వారికి ఎనిమిది నెలల జీతం లభిస్తుంది అని స్విగ్గి తెలిపింది.  తొలగించిన వారికి కంపెనీ వీడియో కాల్స్‌ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తుంది.

also read కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు : నెలరోజుల కనిష్టానికి నిఫ్టీ

ఇక అతిపెద్ద ప్రభావం స్విగ్గి క్లౌడ్ కిచెన్స్ వ్యాపారంపై  పడిందని  స్విగ్గీ సీఈవో  చెప్పారు. ఇది ఇంకా చాలా అస్థిరంగా  ఉండనున్న నేపథ్యంలో రాబోయే 18 నెలల పాటు మూసివేయనున్నట్లు తెలిపారు.ఎంతకాలం ఈ అనిశ్చితి కొనసాగుతుందో ఎవ్వరికీ తెలియదని, దీని ప్రభావం స్విగ్గీపై అయితే తక్కువ కాలం ఉంటుందని ఆశిస్తున్నట్లు ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్ లో పేర్కొన్నారు. 

రూ. 250 కోట్ల పెట్టుబడితో 2020 మార్చి నాటికి  దేశవ్యాప్తంగా  12 కొత్త నగరాల్లో క్లౌడ్‌ కిచెన్స్‌ ఏర్పాటు చేయనున్నామని గత ఏడాది డిసెంబరు లో ప్రకటించింది. చైనా తర్వాత క్లౌడ్ కిచెన్ల సౌకర్యాన్ని అందిస్తున్న రెండో అతిపెద్ద దేశంగా ఇండియా అవతరిస్తుందని, 8 వేల కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నట్టు ప్రకటించింది. 

గత వారం, స్విగ్గీ ప్రత్యర్థి జోమాటో  ఉద్యోగులలో దాదాపు 13 శాతం(600 మందికి పైగా ఉద్యోగులు) మందిని తొలగించింది. వారికి జూమ్ కాల్స్ ద్వారా తెలియజేసింది, మిగిలిన ఉద్యోగులకు జీతంలో కోతలతో పాటు జూన్ నుండి వచ్చే ఆరు నెలల వరకు సీనియర్ పాత్రలలో ఉన్నవారికి అత్యధికంగా 50 శాతం వరకు కోతలు ఉంటాయి అని తెలిపింది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios