కరోనా రోగులకు రోబోలతో ఫుడ్, మెడిసిన్స్: ఐఐటీ విద్యార్థుల ప్రయోగం
కరోనా వైరస్ వ్యాధిగ్రస్తులకు మందులు, ఆహారం అందించేందుకు రోబోలను తయారు చేస్తున్నారు ఐఐటీ ఇంజనీరింగ్ విద్యార్థులు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాధిగ్రస్తులకు మందులు, ఆహారం అందించేందుకు రోబోలను తయారు చేస్తున్నారు ఐఐటీ ఇంజనీరింగ్ విద్యార్థులు. కరోనా సోకిన వారికి వైద్య సేవలు అందించే వారు కూడ ఈ వ్యాధిబారిన పడుతున్నందున ఐఐటీ ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ దిశగా రెండు రోబోల తయారు చేస్తున్నారు.
కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్న వారిని ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ఐసోలేషన్ వార్డులో ఉన్న రోగులకు వైద్యం చేసిన కొందరు వైద్య సిబ్బంది ఈ వ్యాధికి గురయ్యారు.
దీంతో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను రోబోలను తయారు చేయాలని ఐఐటీ గౌహతికి చెందిన మెకానికల్, ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ విభాగాలు యోచిస్తున్నాయి.
also read:కరోనా రోగులకు వైద్యం చేస్తూ మరణిస్తే ఆ కుటుంబాలకు రూ.కోటి: కేజ్రీవాల్
ఆసుపత్రి వర్గాలకు అవసరపడే విధంగా ఈ రోబోలను తయారు చేయాలని ఐఐటీ విద్యార్థులు ప్రయత్నాలను ప్రారంభించారు. రోగుల వ్యర్థాల సేకరణ చేయడంపై వంటి పనులు చేసేలా రోబోల తయారీ కోసం ప్లాన్ చేస్తున్నారు విద్యార్థులు.
రెండు వారాల్లో ఈ రోబోలకు సంబంధించి నమూనాలు తయారు అవుతాయని ఐఐటీ టీమ్ ప్రతినిధులు ప్రకటించారు. ఈ నమూనాలు తయారైన తర్వాత వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చే సెంటర్ ఆఫ్ నానో టెక్నాలజీలో టెస్ట్ రన్ నిర్వహించనున్నట్టుగా వారు తెలిపారు.
ఈ రోబోల పనితీరును పరిశీలించిన తర్వాత ఇతరత్రా పరీక్షల నిర్వహణ కోసం కూడ రోబోలను వినియోగించుకొనేలా డెవలప్ చేయాలని ఐఐటీ ఇంజనీరింగ్ విద్యార్థులు భావిస్తున్నారు.