కరోనా రోగులకు వైద్యం చేస్తూ మరణిస్తే ఆ కుటుంబాలకు రూ.కోటి: కేజ్రీవాల్
కరోనా వైరస్ సోకిన రోగులకు వైద్యం చేస్తూ ఈ వ్యాధి సోకి ఎవరైనా వైద్య సిబ్బంది మరణిస్తే ఆ కుటుంబాలకు కోటి రూపాయాల ఆర్ధిక సహాయం అందిస్తామని ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
న్యూఢిల్లీ: కరోనా వైరస్ సోకిన రోగులకు వైద్యం చేస్తూ ఈ వ్యాధి సోకి ఎవరైనా వైద్య సిబ్బంది మరణిస్తే ఆ కుటుంబాలకు కోటి రూపాయాల ఆర్ధిక సహాయం అందిస్తామని ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
బుధవారం నాడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ విషయాన్ని ప్రకటించారు. కరోనా రోగులకు సేవ చేస్తున్న వైద్య సిబ్బందిని ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. సైనికులకు వీరు తక్కువేం కాదన్నారు.
కరోనా రోగులకు వైద్యం డాక్టర్లు లేదా నర్సులు, శానిటేషన్ సిబ్బందితో పాటు ఇతరులు ఈ వ్యాధి సోకి మరణిస్తే ఆయా కుటుంబాలకు మృతులు చేసిన సేవకు గుర్తింపుగా కోటి రూపాయాల సహాయాన్ని అందిస్తామని ఆయన వివరించారు.
వీరంతా ప్రభుత్వ రంగంలో పనిచేసేవారా లేదా ప్రైవేట్ రంగంలో పనిచేసేవారా అనేది చూడబోమని కేజ్రీవాల్ మీడియాకు తెలిపారు.ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ప్రాంతంలో మార్చి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు మత ప్రార్థనలు జరిగాయి. ఈ ప్రార్థనల్లో దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు విదేశాల నుండి మత బోధకులు హాజరయ్యారు.
Also read:మార్చి 23నే మర్కజ్ నిర్వాహకులకు పోలీసుల హెచ్చరిక, వీడియో విడుదల
నిజాముద్దీన్ మర్కజ్ ప్రాంతంలో ఉన్న 24 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా మంగళవారం నాడు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.ఈ మత ప్రార్థనలకు హాజరై తిరిగి వచ్చిన వారి కారణంగానే ఆయా రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి.