కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీనిని అరికట్టేందుకే దేశంలో లాక్ డౌన్ ప్రకటించారు. అయినా కేసులు తగ్గకపోగా.. రోజూ పెరుగుతూ వస్తున్నాయి. అయితే...  ఈ లాక్ డౌన్ లో వలస కార్మికుల తిప్పలు అన్నీ ఇన్నీ కావు. స్వస్థలానికి చేరుకునేందుకు వారు నానా యాతనలు పడ్డారు. కాగా.. ఓ కార్మికుడు తన ఇంటికి చేరుకునేందుకు 500 కిలోమీటర్లు నడిచి చివరకు ప్రాణాలు వదిలాడు. ఈ విషాద ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

 తాజాగా మహారాష్ట్రలోని నాగపూర్‌ నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమిళనాడులోని నమ్మకల్‌లో సొంత ఇంటికి కాలిబాట పట్టిన లోగేశ్‌ బాలసుబ్రమణి అనే యువ వలస కార్మికుడు సికింద్రాబాద్‌లోని షెల్టర్‌ హోంలో కుప్పకూలి బుధవారం రాత్రి చనిపోయాడు. 

Also Read తబ్లీగీ జమాత్‌కు హాజరైన వారిపై కేంద్రం కొరడా: వీసాలు రద్దు...

లాక్‌డౌన్‌ మూలాన ప్రజారవాణా మొత్తం స్థంబించిపోవడంతో లోగేశ్‌ లాంటి లక్షలాది మంది ఇలా కాలిబాటనే సొంతవూళ్లకు తిరిగివెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. లోగేశ్‌తో పాటు 26 మంది బృందం నాగపూర్‌ నుంచి తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లోని తమ సొంత ఊళ్లకు నడుచుకుంటూ తిరుగుప్రయాణమయ్యారు. 

'మూడు రోజుల నుంచి నడుచుకుంటూ వస్తున్నాం. ఒక్క బండి కూడా లేదు. అక్కడక్కడ ప్రజలు ఇచ్చే ఆహారం తీసుకుంటూ ముందుకు సాగాము. నిత్యావసరాలు రవాణా చేసే వాహనాల్లో కొందరు లిఫ్ట్‌ ఇచ్చారు. ఇది చూసిన పోలీసులు ఆ వాహనాల డ్రైవర్లును చితకబాదారు' అని ఈ బృందంలో ఒకరైన సత్య అనే కార్మికుడు వాపోయాడు. 

నాగపూర్‌ - తెలంగాణ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు నమోదయ్యాయి. ఇంతటి ఎండలో నడుచుకుంటూ వెళ్తున్న లోగేశ్‌ బృందాన్ని బోయిన్‌పల్లిలో గుర్తించిన మార్కెడ్‌ యార్డ్‌ చైర్‌పర్సన్‌ వారిని వెస్ట్‌ మారేడ్‌ పల్లిలోని కమ్యూనిటీ హాల్‌కు తరలించారు. బుధవారం రాత్రంతా అక్కడే ఉన్నారు. 

లోగేశ్‌ కూర్చున్న చోటే కుప్పకూలిపోయాడు. వైద్యులు పరిశీలించగా అప్పటికే అతను ప్రాణాలొదిసే నట్లు తెలిపారు. లోగేశ్‌ మృత దేహాన్ని గాంధీ ఆసుపత్రికి పోస్టు మార్టం నిమిత్తం తరలిం చారు. 

రవాణా సమస్యల కారణంగా లోగేశ్‌ అంత్యక్రియలను హైదరాబా ద్‌లోనే నిర్వహిం చేందుకు బృందంలోని అతని స్నేహితులు ప్రయత్నాలు చేశారు.ఈ విషయాన్ని తెలుసుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి లోగేశ్‌ మృతదేహాన్ని తమిళనాడులోని సొంత ఇంటికి చేర్చే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కనీసం కడసారి చూపైనా ఆ కుటంబానికి దక్కాలే చూడాలని కోరారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా అందరినీ కలచివేసింది.