ఇండియాలో 4067కి చేరిన కరోనా కేసులు,109 మంది మృతి: కేంద్రం

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య సోమవారం నాటికి 4,067కి చేరుకొంది. గత 24 గంటల్లో కొత్తగా 693 కేసులు నమోదైనట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
 

Coronavirus: India reports 693 new cases in last 24 hrs; total at 4067

 
న్యూఢిల్లీ: దేశంలో

కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య సోమవారం నాటికి 4,067కి చేరుకొంది. గత 24 గంటల్లో కొత్తగా 693 కేసులు నమోదైనట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

సోమవారం నాడు సాయంత్రం కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు 109 మంది మృతి చెందారు. దేశంలో నమోదైన 4067 కరోనా కేసుల్లో 1445 కేసులు ఢిల్లీ మర్కజ్ ప్రార్ధనల్లో పాల్గొని వచ్చినవారేనని కేంద్రం ప్రకటించింది.

Also read:కరోనా అంటిస్తావా అంటూ లేడీ డాక్టర్‌పై వ్యక్తి దాడికి యత్నం

కరోనా వైరస్ సోకినవారిలో 76 శాతం మంది పురుషులే ఉన్నారని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ చెప్పారు.47 శాతం కరోనా కేసులు 40 ఏళ్లలోపు వయస్సు వాళ్లకు సోకిందని కేంద్రం తేల్చింది. 34 శాతం కేసులు 40 నుండి 60 ఏళ్ల వయస్సు మధ్య వారికి సోకిందని లవ్ అగర్వాల్ చెప్పారు.

మృతి చెందిన వారిలో 30 మంది 60 ఏళ్లకు పైబడినవారే ఉన్నారు.63 శాతం మంది 60 ఏళ్లకు పైబడిన వారే మృత్యువాతపడ్డారని గణాంకాలు చెబుతున్నాయి. దేశ వ్యాప్తంగా మర్కజ్ ప్రార్ధనల్లో పాల్గొని వచ్చిన వారితో పాటు వారితో సన్నిహిత సంబంధాలు కలిగిన సుమారు 25 వేల మందిని క్వారంటైన్ చేసినట్టుగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది.దేశ వ్యాప్తంగా 291 మంది ఈ వ్యాధి నుండి కోలుకొన్నారని కేంద్రం తెలిపింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios