ఇండియాలో 24 గంటల్లో 354 కొత్త కరోనా కేసులు, 117 మంది మృతి
దేశంలో మంగళవారం నాటికి 4421 కరోనా కేసులు నమోదైనట్టుగా కేంద్రం తెలిపింది. 24 గంటల్లో 354 కొత్త కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
న్యూఢిల్లీ: దేశంలో మంగళవారం నాటికి 4421 కరోనా కేసులు నమోదైనట్టుగా కేంద్రం తెలిపింది. 24 గంటల్లో 354 కొత్త కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
మంగళవారం నాడు మధ్యాహ్నం కేంద్ర ఆరోగ్య జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడారు.గత 24 గంటల్లో ఈ వ్యాధితో 8 మంది మృతి చెందినట్టుగా ఆయన చెప్పారు. దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 117కి చేరుకొందని కేంద్రం ప్రకటించింది.
టెక్నాలజీ సహాయంంతో క్వారంటైన్ లో ఉన్న వారిపై నిఘా ఏర్పాటు చేసినట్టుగా ఆయన తెలిపారు.ఈ వ్యాధి సోకి నయమైన 326 మంది ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయినట్టుగా ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ఇండియన్ రైల్వే శాఖ దేశ వ్యాప్తంగా 2500 ఏసీ రైల్వే కోచ్‌లలో 40వేల బెడ్స్ ను సిద్దం చేసిందన్నారు. ప్రతి రోజూ 373 ఐసోలేషన్ బెడ్స్ ను రైల్వేశాఖ సిద్దం చేస్తోందని కేంద్రం తెలిపింది.దేశంలోని 133 ప్రాంతాల్లో ఐసోలేషన్ బెడ్స్ ను రైల్వే శాఖ సిద్దం చేసిందని లవ్ అగర్వాల్ ప్రకటించారు.
also read:లాక్ డౌన్: కేసీఆర్ బాటలోనే మరికొందరు సీఎంలు, మోడీ ఆలోచనపై ఉత్కంఠ
ముంబై, ఢిల్లీ, ఆగ్రా మురికి వాడల్లో కరోనా విస్తరించకుండా చర్యలు తీసుకొంటున్నట్టుగా కేంద్రం తెలిపింది.కరోనా సమన్వయానికి కొత్త విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు అగర్వాల్.
లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం నాడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాల్లో నిత్యావసర సరుకులు, ప్రభుత్వాలు తీసుకొంటున్న చర్యలపై ఆయన సమీక్ష నిర్వహించినట్టుగా కేంద్రం హోంశాఖ అధికారి ప్రకటించారు. రాష్ట్రాల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది.