కరోనా దెబ్బ: యూపీ 15 జిల్లాల్లో హాట్ స్పాట్స్ మూసివేత, మాస్క్ తప్పనిసరి

కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదౌతున్న నేపథ్యంలో యూపీ ప్రభుత్వం బుధవారం నాడు కీలక నిర్ణయం తీసుకొంది. హాట్ స్పాట్స్ గా గుర్తించిన 15 జిల్లాల్లోని ప్రాంతాలను ఏప్రిల్ 15వ తేదీవరకు మూసివేయనున్నారు.

Coronavirus: COVID-19 Hotspots In UP Sealed Till April 15, Masks Will Be Mandatory

లక్నో:కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదౌతున్న నేపథ్యంలో యూపీ ప్రభుత్వం బుధవారం నాడు కీలక నిర్ణయం తీసుకొంది. హాట్ స్పాట్స్ గా గుర్తించిన 15 జిల్లాల్లోని ప్రాంతాలను ఏప్రిల్ 15వ తేదీవరకు మూసివేయనున్నారు.. బుధవారం నాడు అర్ధరాత్రి నుండి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని యూపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రకటించారు.

ఈ 15 జిల్లాలోని  హాట్ స్పాట్స్ లుగా గుర్తించిన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు నిత్యావసర సరుకులను నేరుగా ప్రజలకు అందించనున్నట్టుగా  రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 

రాష్ట్రంలోని లక్నో, గౌతమ్ బుద్దా నగర్, ఇండస్ట్రీయల్ టౌన్ షిప్, నోయిడా, ఘజియాబాద్, మీరట్, ఆగ్రా, శామ్లీ, సహరాన్ పూర్ తదితర ప్రాంతాల్లో ప్రభుత్వమే ప్రజలకు అన్ని రకాల సరుకులను అందించనున్నారు.

ఒకవేళ ఇంటి నుండి బయటకు రావాల్సిన పరిస్థితులు వస్తే  మాస్క్ ను తప్పనిసరిగా వాడాలని ప్రభుత్వం సూచించింది.రాష్ట్రంలో ఇప్పటికే 326 కేసులు నమోదయ్యాయి.  ఈ వ్యాధితో ఇప్పటికే 21 మంది మృతి చెందారు.రాష్ట్రంలోని హాట్ స్పాట్స్ గా గుర్తించిన 15 జిల్లాల్లో ఆరు కంటే ఎక్కువగా కరోనాకేసులు నమోదయ్యాయి.

Also కరోనాఎఫెక్ట్ :హిందూ మహిళ మృతి, పాడె మోసిన ముస్లింలుread:

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. దేశ వ్యాప్తంగా ఈ నెల 14వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంది. అయితే లాక్ డౌన్ మరిన్ని రోజులు పొడిగించాలని కూడ యూపీ సర్కార్ కూడ అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు కూడ లేని సమయంలోనే రాష్ట్రంలో లాక్ డౌన్ ను ఎత్తివేస్తామని యూపీ రాష్ట్ర ప్రభుత్వ అదనపు చీఫ్ సెక్రటరీ అవనీష్ అవస్తీ తెలిపారు.ఒక్క కరోనా కేసు ఉన్న కూడ లాక్ డౌన్ ఎత్తివేస్తే ప్రయోజనం ఉండదన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios