దేశంలో 2301కి చేరిన కరోనా కేసులు, 56 మంది మృతి: వైద్యులపై దాడి చేస్తే కఠిన చర్యలు


దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2301కి చేరుకొందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు 56 మంది మృతి చెందినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ ప్రకటించారు. మరో వైపు వైద్య సిబ్బందిపై దాడి చేస్తే కఠినంగా శిక్షించాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది.

 

corona virus:647 COVID-19 cases reported in 14 states since Wednesday are related to Tablighi Jamaat event, says Centre


న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2301కి చేరుకొందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు 56 మంది మృతి చెందినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ ప్రకటించారు. మరో వైపు వైద్య సిబ్బందిపై దాడి చేస్తే కఠినంగా శిక్షించాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది.

శుక్రవారంనాడు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. గత 24 గంటల్లో ఎనిమిది వేల మంది శాంపిల్స్ ను పరీక్షల కోసం పంపామన్నారు. 24 గంటల్లో 336 కొత్త కేసులు నమోదైనట్టుగా కేంద్రం తెలిపింది. అంతేకాదు ఒక్క రోజు వ్యవధిలోనే 12 మంది మృతి చెందారని కేంద్రం తేల్చి చెప్పింది.

కరోనా వైరస్ సోకిన వ్యాధిగ్రస్తులు దేశ వ్యాప్తంగా 157 మంది కోలుకొన్నారని లవ్ అగర్వాల్ చెప్పారు. రెండు రోజులుగా నమోదైన 647 కరోనా పాజిటివ్ కేసులు ఢిల్లీ మర్కజ్ ప్రాంతంలో ప్రార్ధనల్లో పాల్గొన్నవారేనని కేంద్రం ప్రకటించింది.

also read:కరోనా ఎఫెక్ట్: వలస కార్మికులకు కనీస వేతనాలివ్వాలని సుప్రీంలో పిటిషన్, కేంద్రానికి నోటీస్

దేశంలోని అండమాన్ నికోబార్, అసోం, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ,హర్యానా, హిమాచల్ ప్రదేశ్,జమ్మూ కాశ్మీర్, తెలంగాణ, జార్ఖండ్,రాజస్తాన్, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదైనట్టుగా కేంద్రం వివరించింది.

వైద్య సిబ్బంది, వైద్యులపై దాడి చేస్తే కఠినంగా శిక్షించాలి

కరోనా వైరస్ సోకినవారికి చికిత్స అందిస్తున్న వారికి  వైద్యం చేస్తున్న డాక్టర్లతో పాటు వైద్య సిబ్బందితో పాటు ఇతరులపై దాడులకు దిగే వారిని కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సెక్రటరీ శుక్రవారంనాడు అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios