న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో  వలస కార్మికులకు కనీస వేతనాలు అందించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను శుక్రవారం నాడు సుప్రీంకోర్టు విచారించింది.

హరిష్ మందిర్, అంజలి భరద్వాజ్ లు శుక్రవారం నాడు వలస కార్మికులకు కనీస వేతనాలు అందించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టును ఆ పిటిషన్ లో కోరారు. 

Also read:కరోనా ఎఫెక్ట్: పాన్ మసాలా, చూయింగ్ గమ్‌లపై నిషేధం

ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ విషయమై తమ అభిప్రాయాన్ని చెప్పాలని కోరుతూ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.గతంలో సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం వలస కార్మికుల విషయమై కీలక విషయాలను తెలిపింది. లాక్ డౌన్ కారణంగా 22 లక్షల 88 వేల వలస కార్మికులు ఉన్నారు. 

వలస కార్మికులకు ప్రతి రోజు ఆహారం, షెల్టర్ అందిస్తున్నట్టుగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టుకు గతంలో తెలిపిన విషయం తెలిసిందే.

లాక్‌డౌన్ కారణంగా వలస కార్మికులు తాము ఉంటున్న ప్రాంతాల నుండి స్వగ్రామాలకు తిరిగి వెళ్లారు. వాహనాలు లేకున్నా కాలినడకన తమ గ్రామాలకు వెళ్లారు. మార్గమధ్యలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు.