ఇండియాపై కరోనా దెబ్బ: 50 మంది మృతి, 1965కి చేరుకొన్న కేసులు
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రపంచంలోని పలు దేశాలు అనేక జాగ్రత్తలు తీసుకొంటున్నాయి. భారత్ లో కూడ అనేక జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు లాక్‌డౌన్ ను అమలు చేసినా కూడ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరగడం ఆందోళన కల్గిస్తోంది
ఇండియాపై కరోనా దెబ్బ: 50 మంది మృతి, 1965కి చేరుకొన్న కేసులు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రపంచంలోని పలు దేశాలు అనేక జాగ్రత్తలు తీసుకొంటున్నాయి. భారత్ లో కూడ అనేక జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు లాక్‌డౌన్ ను అమలు చేసినా కూడ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరగడం ఆందోళన కల్గిస్తోంది. దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1965కు చేరుకొన్నాయి.
దేశంలో 1834 కరోనా పాజిటివ్ కేసుల్లో 41 మంది మృతి చెందారు. 24 గంటల్లోనే దేశంలో 437 కొత్త కేసులు నమోదయ్యాయి.మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి.బుధవారం నాడు రాత్రికి రాత్రే 131 కరోనా పాజిటివ్ కేసుల్లో 9 మంది మృతి చెందారు.దీంతో మృతుల సంఖ్య 50 మందికి చేరింది.
రాజస్థాన్ రాష్ట్రంలో కొత్తగా 9 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 129కు చేరుకొంది. జోథ్‌పూర్ , జుహున్‌జునులో 1, రామ్‌గంజ్, జైపూర్ పట్టణాల్లో మొత్తం ఏడు కేసులు నమోదయ్యాయి.
నిజాముద్దీన్ మర్కజ్ లో ఉన్న వారిలో 167 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు కన్పించాయి. దీంతో వారిని ఢిల్లీ నిజాముద్దీన్ తుగ్లకాబాద్ క్వారంటైన్ సెంటర్ కు మంగళవారం నాడు రాత్రి తరలించారు.
మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 338కు చేరుకొన్నాయి. తాజాగా పూణె నుండి రెండు, బుల్దానా నుండి ఒక్క కేసు నమోదైంది.పద్మశ్రీ నిర్మల్ ఖల్సా కరోనా వైరస్ కారణంగా అమృత్ సర్ లో మృతి చెందినట్టుగా రిపోర్టులు చెబుతున్నాయి.
గుజరాత్ రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య ఆరుకు చేరుకొంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడ ఈ వ్యాధితో మరణించిన వారి సంఖ్య ఆరుకు చేరుకొంది. పాజిటివ్ కేసుల సంఖ్య 99కు చేరుకొంది.
పంజాబ్ రాష్ట్రంలో 46 కేసులు నమోదైతే, నలుగురు మరణించారు. కర్ణాటక, బెంగాల్ రాష్ట్రాల్లో ముగ్గురు మృతి చెందారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మరణించారు. కేరళలో 265 కేసులు నమోదైతే ఇద్దరు చనిపోయారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో 113 కేసుల్లో ఇద్దరు మృతి చెందారు.
లాతూరులో 100 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను అరెస్ట్ చేసినట్టుగా ప్రకటించారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన మార్నింగ్ వాక్ నిర్వహించినందుకు వారిని అరెస్ట్ చేశారు పోలీసులు.
Name of State Total cases cured Death
Andhra Pradesh 86 1 1
Andaman and Nicobar 10 0 0
Assam 1 0 0
Bihar 23 0 1
Chandigarh 16 0 0
Chhattisgarh 9 2 0
Delhi 152 6 2
Goa 5 0 0
Gujarat 82 5 6
Haryana 43 21 0
Himachal Pradesh 3 1 1
Jammu and Kashmir 62 2 2
Jharkhand 1 0 0
Karnataka 110 9 3
Kerala 265 25 2
Ladakh 13 3 0
Madhya Pradesh 99 0 6
Maharashtra 335 42 13
Manipur 1 0 0
Mizoram 1 0 0
Odisha 4 0 0
Puducherry 3 1 0
Punjab 46 1 4
Rajasthan 108 3 0
Tamil Nadu 234 6 1
Telengana 96 1 3
Uttarakhand 7 2 0
Uttar Pradesh 113 14 2
West Bengal 37 6 3
Total 1965 1 51 50