Asianet News TeluguAsianet News Telugu

కరోనా లాక్ డౌన్: కారును ఆపినందుకు యువతీ హల్చల్, పోలీస్ చేయి కొరికి, రక్తం ఊసి... వీడియో వైరల్

షట్ డౌన్ నేపథ్యంలో నిర్మానుష్య రోడ్డులోంచి వస్తున్న ఒక కారును పోలీసులు ఆపారు. ఎక్కడికెళ్ళి వస్తున్నారు అని ప్రశ్నిస్తే... మందులు కొనడానికి అని సమాధానమిచ్చారు. ప్రిస్క్రిప్షన్ చూపమని అడిగితే లేదు అన్నారు. ఇంతలోనే లోపలి నుంచి దిగిన యువతీ పోలీసులను దుర్భాషలాడుతూ... అక్కడే డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ ని కొరికింది. 

Corona Lockdown: Woman Bites Cop and smears blood over stopping her car
Author
Kolkata, First Published Mar 26, 2020, 11:11 AM IST

ప్రపంచమంతా కరోనా వైరస్ బారినపడి బయటపడలేక కొట్టుమిట్టాడుతుంది. అంతకంతకు పెరుగుతున్న కేసులు, మరణాలతో ప్రపంచ దేశాల ప్రభుత్వాలు ఏమి చేయాలో అర్థం కాక తలలు బద్దలు కొట్టుకుంటున్నాయి. 

భారతదేశంలో కూడా ఈ కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తుంది. వైరస్ కోరలు చాస్తున్నవేళ ప్రధాని మోడీ దేశమంతా 21 రోజుల సంపూర్ణ లాక్ డౌన్ ను ప్రకటించారు. మోడీ సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించేకన్నా ముందే.... దేశంలోని చాలా వరకు రాష్ట్రాలు లాక్ డౌన్ ని ప్రకటించివేశాయి. 

ఇలా లాక్ డౌన్లకు కొందరు సహకరిస్తుండగా... మరికొందరేమో పోలీసులను ఇబ్బంది పెడుతున్నారు. పోలీసులు కూడా పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అవసరమైతే.... వారి రీతిలో సమాధానమిస్తున్నారు. 

Also read:కరోనా ఎఫెక్ట్: పొందుగుల బ్రిడ్జి వద్ద ఉద్రిక్తత, ఏపీలోకి నో ఎంట్రీ

ఇక కోల్కతాలో జరిగిన ఒక సంఘటన అందరిని నివ్వెర పోయేలా చేసింది. షట్ డౌన్ నేపథ్యంలో నిర్మానుష్య రోడ్డులోంచి వస్తున్న ఒక కారును పోలీసులు ఆపారు. ఎక్కడికెళ్ళి వస్తున్నారు అని ప్రశ్నిస్తే... మందులు కొనడానికి అని సమాధానమిచ్చారు. ప్రిస్క్రిప్షన్ చూపమని అడిగితే లేదు అన్నారు. ఇంతలోనే లోపలి నుంచి దిగిన యువతీ పోలీసులను దుర్భాషలాడుతూ... అక్కడే డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ ని కొరికింది. 

అక్కడితో ఆగకుండా రక్తాన్ని అతడిపై ఊసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. తనకు గనుక కరోనా ఉంటె... నీకు కూడా ఎక్కించి తీరుతాను అన్న కసితో ఇలా ప్రవర్తించడం నిజంగా బాధాకరమని నెటిజెన్ల వాపోతున్నారు. ఆ తరువాత కూడా చాలాసేపు ఆ యువతీ అక్కడే వారితో వాగ్విదానికి దిగింది. 

ఇక అప్పటికి ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయినా పోలీసులు మాత్రామ్ ఆమె వివరాలను సేకరించి అరెస్ట్ చేసారని సమాచారం. ఇకపోతే కరోనా వైరస్ మనదేశంలో నానాటికి విజృంభిస్తుంది. అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా సాధ్యమైనంత మేర రక్షణ చర్యలను చేపడుతున్నాయి. 

ప్రస్తుతం దేశంలో 664 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 128 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానం 118తో రెండో స్థానంలో నిలిచింది. కర్ణాటక, తెలంగాణ ఆ తర్వాత వరుస స్థానాలను అక్రమించాయి. రాష్ట్రాలవారీగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది.

మహారాష్ట్ర 128
కేరళ 118
కర్ణాటక 51
తెలంగాణ 41
గుజరాత్ 38
రాజస్థాన్ 38
రాజస్థాన్ 38
ఉత్తరప్రదేశ్ 38
ఢిల్లీ 35
హర్యానా 31
పంజాబ్ 31
తమిళనాడు 26
మధ్యప్రదేశ్ 15
లడక్ 13
జమ్మూ కాశ్మీర్ 11
ఆంధ్రప్రదేశ్ 10
పశ్చిమ బెంగాల్ 10
చండీగడ్ 7
ఉత్తరాఖండ్ 5
బీహార్ 4
చత్తీస్ గడ్ 3
గోవా 3
హిమాచల్ ప్రదేశ్ 3
ఒడిశా 2
మణిపూర్ 1
మిజోరం 1
పుదుచ్చేరి 1

కరోనా కట్టడికి ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 14వ తేదీన వరకు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపుగా అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios