బంధువులొస్తే కరోనా వస్తదేమో.. నాలుగు నిమిషాల్లో పెళ్లి

కొందరు బుక్ చేసుకున్న కళ్యాణ మండపాలు మూతపడ్డాయని.. ఇంటి వద్ద పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో ఓ జంట కేవలం నాలుగు నిమిషాల్లో తమ పెళ్లి తంతు ముగించారు.
 

corona effect: Love Couple Finished their Marriage just in Four Minutes

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా జనాలు పిట్టలు  రాలిపోయినట్లు రాలిపోతున్నారు.  ఈ క్రమంలో వైరస్ ని అరికట్టేందుకు దేశంలో లాక్ డౌన్ ప్రకటించారు.

అయితే.. ఈ ప్రకటనకు ముందే చాలా మంది పెళ్లిళ్లు నిశ్చయం చేసుకున్నారు. కేంద్రం ప్రకటనతో చాలా మంది వాయిదా వేసుకున్నారు. కొందరు బుక్ చేసుకున్న కళ్యాణ మండపాలు మూతపడ్డాయని.. ఇంటి వద్ద పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో ఓ జంట కేవలం నాలుగు నిమిషాల్లో తమ పెళ్లి తంతు ముగించారు.

Also Read కరోనా లాక్ డౌన్: మోడీ నియోజకవర్గంలో తిండి దొరక్క గడ్డి తింటున్న పిల్లలు...

ఈ సంఘటన బళ్లారిలోచోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వాళ్లు కూడా అందరిలాగేనే గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ.. కరోనా వచ్చి లాక్ డౌన్ అయిపోయింది కదా. పెళ్లి వాయిదా వేసుకుందామని అనుకున్నారు. కానీ.. ఆ తర్వాతైనా బంధువులు వస్తే.. మళ్లీ కరోనా వస్తుందేమో అని భయపడిపోయారు. అంతే కేవలం నాలుగు నిమిషాల్లో పెళ్లి చేసుకున్నారు.

సిద్ధాపురం గ్రామానికి చెందిన రోహిణి(20), మధు(25) ప్రేమించుకున్నారు. వారి ప్రేమను రెండు కుటుంబాల పెద్దలు అంగీకరించారు. పెళ్లి ముహుర్తం దగ్గరపడే సమయానికి లాక్ డౌన్ ప్రకటించారు. దీంతో చేసేది లేక.. వధువు, వరుడు వాళ్ల తల్లిదండ్రులు.. పూజారి తో వెళ్లి.. నాలుగంటే నాలు నిమిషాల్లో పెళ్లి తంతు ముగించారు. కేవలం వెళ్లారు.. తాళి కట్టించుకున్నారు వచ్చేశారు. అంతే. పెద్దలు నాలుగు అక్షింతలు వేయగా.. తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. కాగా.. వీరి పెళ్లి తంతు స్థానికంగా వైరల్ అయ్యింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios