Asianet News TeluguAsianet News Telugu

వాటితో మెడికల్ గౌన్లు, ఫేస్ మాస్కులను తయారి చేయనున్న ఫోర్డ్ కంపెనీ

మెడికల్ గౌన్ల ఉత్పత్తి ఏప్రిల్ 19 నాటికి వారానికి 75,000 గౌన్లను తయారు చేయనుంది. ఆ తరువాత అంటే ఏప్రిల్ 19 తరువాత వారానికి 1 లక్షకు మించి మెడికల్ గౌన్లను తయారు చేస్తుంది.
car maker Ford company Is Making Medical Gowns Out Of Airbag Material
Author
Hyderabad, First Published Apr 15, 2020, 5:52 PM IST
కరోనా వైరస్ మహమ్మారిపై పోరుకు కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్ సంస్థ ముందుకు వచ్చింది. వైద్య ఆరోగ్య సంరక్షణ కార్మికులకు, కరోనా వైరస్ తో  పోరాడుతున్న రోగులకు అత్యంత  అవసరమైన వైద్య పరికరాలను, సామాగ్రిని రూపొంది ఉత్పత్తి చేయడానికి ప్రయత్నాలను విస్తరించింది. మిచిగాన్‌లోని ప్లైమౌత్‌లో ప్రస్తుతం మిలియన్లకు పైగా ఫేస్ షీల్డ్స్ ఉత్పత్తితో పాటు, ఫోర్డ్ సంస్థ ఈ రోజు గాలిని శుద్ధి చేసే రెస్పిరేటర్ ఉత్పత్తిని ప్రారంభించింది.

ఫోర్డ్ కంపెనీ ఇప్పుడు ఫేస్ మాస్క్‌లను ఉత్పత్తితో పాటు, వైద్య ఆరోగ్య సంరక్షణ కార్మికుల కోసం పునర్వినియోగ మెడికల్ గౌన్ల ఉత్పత్తిని మరింత పెంచేందుకు ప్రయత్నిస్తుంది. అయితే తమ ఫోర్డ్ కంపెనీ కార్లలో ఎయిర్‌బ్యాగులు తయారు చేయడానికి ఉపయోగించే అదే పదార్థాన్ని ఉపయోగించి వీటిని తయారు చేస్తారు.

మెడికల్  గౌన్ల ఉత్పత్తి ఏప్రిల్ 19 నాటికి వారానికి 75,000 గౌన్ల ఉత్పత్తికి  చేరుకుంటుంది. ఏప్రిల్ 19 నుండి ప్రతి వారానికి 1 లక్ష గౌన్ల తయారీ వరకు చేరుకుంటుంది. జూలై 4 నాటికి, ఫోర్డ్-సరఫరాదారు జాయ్సన్ సేఫ్టీ సిస్టమ్స్ 1.3 మిలియన్ మెడికల్ గౌన్లను కత్తిరించి కుట్టనుంది, ఇవి ఫెడరల్ స్టాండర్డ్ అనుగుణంగా సెల్ఫ్ టెస్ట్ చేయబడుతుంది. అలాగే ఇవి దాదాపు 50 సార్లు వాష్ చేయవచ్చు.

also read  వారికోసం శానిటైజేషన్ యూనిట్లుగా ముంబై పోలీస్ వాహనాలు... 

ఫోర్డ్ మెట్రో డెట్రాయిట్‌లోని బ్యూమాంట్ హెల్త్‌తో కలిసి గౌను ప్యాటర్న్ త్వరగా రూపొందించడానికి, దాని  సైజ్, దాని ఫంక్షన్ ట్రయల్స్ సమయంలో పరీక్షించనుంది. ఇప్పటికే 5 వేలకు పైగా గౌన్లు ఆసుపత్రికి అందించారు కూడా. ఏప్రిల్ 19 నాటికి గౌన్ల ఉత్పత్తి వారానికి 75,000 గౌన్లకు చేరుకుంటుంది

ఫోర్డ్ కంపెనీ  వైద్య కార్మికుల కోసం పూర్తి-ముఖాన్ని కప్పే మాస్కుల తయారీని కూడా కొనసాగిస్తోంది. యు. ఎస్ తో పాటు, కెనడా, థాయ్‌లాండ్‌లోని ఫోర్డ్ కంపెనీల వద్ద, భారతదేశంలోని  ఫోర్డ్ జాయింట్ వెంచర్ భాగస్వామి మహీంద్రా & మహీంద్రాతో ఫేస్ షీల్డ్ ఉత్పత్తిని ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించింది.

యు.కే. లో వెంటిలేటర్ ప్రీ-ప్రొడక్షన్ కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయి, ఫోర్డ్ కంపెనీ వెంటిలేటర్లను తయారు చేయడానికి కూడా సన్నద్ధమవుతున్నాయి. యు.కె ప్రభుత్వం ఆదేశించిన 15వేల వెంటిలేటర్ల డిమాండ్‌ను తీర్చడానికి ఈ ఉత్పత్తి సహాయపడుతుంది.
Follow Us:
Download App:
  • android
  • ios