Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఎఫెక్ట్: డిజిటల్‌లోనే ఆడి కార్స్ ’బుకింగ్స్’ అండ్ సేల్స్

లాక్ డౌన్ సడలింపుల తర్వాత పారిశ్రామిక రంగం కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. ఆడి ఇండియా సోమవారం కార్యకలాపాలు ప్రారంభించింది. ఇక నుంచి దాదాపు లావాదేవీలన్నీ (సేల్స్, బుకింగ్స్) డిజిటల్ వేదికగానే జరుగుతాయని వెల్లడించింది. 
 

Audi India launches online sales initiative amid coronavirus pandemic
Author
Hyderabad, First Published May 12, 2020, 10:18 AM IST

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావం ఆటో పరిశ్రమ కార్యకలాపాలను పూర్తిగా మార్చేసింది. లాక్‌డౌన్ వల్ల మూతపడిన ఆటో పరిశ్రమ ఇప్పుడిప్పుడే తెరుచుకుంటోంది. 

లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో ప్రముఖ ద్విచక్ర వాహనాల సంస్థ హీరో మోటోకార్ప్ సహా కొన్ని కంపెనీలు ఇటీవలే కార్యకలాపాలు ప్రారంభించాయి. తాజాగా జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా కూడా కార్యకలాపాలు మొదలుపెట్టింది.

కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో ఆటో మేకర్లు అన్నీ డిజిటల్ వైపు దృష్టిసారిస్తున్నాయి. వినియోగదారులకు వీలైనంత దూరంగా ఉంటూ కాంటాక్ట్‌లెస్ విధానాన్ని పాటిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆన్‌లైన్ సేల్స్, సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. 

ఆడి ఇండియా కూడా ఇప్పుడు ఆన్‌లైన్ సేల్స్‌ను ప్రారంభించింది. కొత్త వినియోగదారులకు ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుత కస్టమర్లు తమ షెడ్యూల్ సర్వీసులను ఆన్‌లైన్‌లో డోర్ స్టెప్ పిక్-అప్, డ్రాప్‌లను ఎంపిక చేసుకుని బుక్ చేసుకోవచ్చు. 

also read నిస్సాన్ కార్ల ఉత్పత్తి నిలిపివేత...బి‌ఎస్ 6 అప్ డేట్ కారణం...

ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ వర్చువల్ రియాల్టీ ఎలిమెంట్స్‌తోపాటు కస్టమర్లకు ఫ్యూచర్ టెక్నాలజీలను అందుబాటులోకి తేవడంలో తమ సంస్థ ముందు ఉంటుందన్నారు. ‘డిజిటలైజేషన్ వ్యూహం ప్రకారం డిజిటల్ సేల్స్ విధానాన్ని ప్రకటిస్తున్నాం. విక్రయం తర్వాత ఫ్యూచర్ కస్టమర్లకు మద్దతుగా నిలుస్తాం’ అని చెప్పారు. 

ఆడి కారు కొనుగోలు దారులు వెబ్ సైట్లలో ఆయా కార్ల మోడళ్లు, వాటిల్లో ఫీచర్లతోపాటు తమ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఇంటి వద్ద నుంచే తమకు ఇష్టమైన కారు కోసం ఆర్డర్ చేయొచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఆన్ లైన్ సేల్స్ ప్రారంభించాలని భావించినా.. కరోనా ప్రభావంతో ద్వితీయ త్రైమాసికంలోకి మార్చామని ధిల్లాన్ తెలిపారు. 

ఆన్ లైన్ ఫెసిలిటీ అందుబాటులో ఉన్నా అధిక మొత్తంలో ఖర్చు చేసి కొనుగోలు చేస్తున్నందున భౌతికంగా కారు మాడల్ చూసుకునే వెసులుబాటు ఆడి కారు కల్పిస్తోంది. అయితే సాధ్యమైనంత మేరకు ప్రతి ఒక్కరితోనూ కాంటాక్ట్ లెస్ విధానాన్ని పాటిస్తామని ధిల్లాన్ వివరించారు. 

ఆడి ఇండియాకు దేశవ్యాప్తంగా 36 సేల్స్ టచ్ పాయింట్లు ఉన్నాయి. ఆడి కారు ప్రత్యర్థి సంస్థలు మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ కూడా తమ కార్ల విక్రయాలు ఆన్ లైన్ లోనే సాగుతాయని ఇప్పటికే ప్రకటించాయి. హ్యుండాయ్, వోక్స్ వ్యాగన్, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా కార్స్ సంస్థలు కూడా కొన్ని రోజుల క్రితం ఆన్ లైన్ సేల్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. 
 

Follow Us:
Download App:
  • android
  • ios