నిస్సాన్ కార్ల ఉత్పత్తి నిలిపివేత...బి‌ఎస్ 6 అప్ డేట్ కారణం...

గత నెలలో బిఎస్ 6 ఉద్గార నిబంధనలు అమల్లోకి రావడంతో, నిస్సాన్ ఇండియా భారత మార్కెట్ లో తన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను తగ్గించాలని నిర్ణయించింది. జపాన్ ఆటో తయారీదారు తన అధికారిక భారతీయ వెబ్‌సైట్ నుండి నిస్సాన్ మైక్రో, మైక్రో యాక్టివ్, సన్నీలను నిలిపివేసింది. ప్రస్తుతం, బిఎస్ 6 అప్ డేట్ గల నిస్సాన్  కిక్స్, జిటి-ఆర్ మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉన్న రెండు కార్లు.

Nissan India has officially discontinued the Micra, Micra Active and Sunny sedan from the Indian market

ఆటోమొబైల్ దిగ్గజం జపాన్ కార్ల తయారీ కంపెనీ నిస్సాన్ ఇండియా తాజాగా మైక్రో, మైక్రో యాక్టివ్ మరియు సన్నీ సెడాన్లను భారత మార్కెట్ నుండి అధికారికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

గత నెలలో బిఎస్ 6 ఉద్గార నిబంధనలు అమల్లోకి రావడంతో, నిస్సాన్ ఇండియా భారత మార్కెట్ లో తన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను తగ్గించాలని నిర్ణయించింది. జపాన్ ఆటో తయారీదారు తన అధికారిక భారతీయ వెబ్‌సైట్ నుండి నిస్సాన్ మైక్రో, మైక్రో యాక్టివ్, సన్నీలను నిలిపివేసింది.

ప్రస్తుతం, బిఎస్ 6 అప్ డేట్ గల నిస్సాన్  కిక్స్, జిటి-ఆర్ మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉన్న రెండు కార్లు. కార్ల తయారీదారి నిస్సాన్ ఈ కార్లను బిఎస్ 6 అప్ డేట్  లేనందున వాటిని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. నిస్సాన్ ఇండియా ప్రతినిధి ఈ నిర్ణయాన్ని అధికారికంగా ధృవీకరించారు.

బిఎస్ 6 ఉద్గార నిబంధనలు, తక్కువ అమ్మకాలు, అధిక పెట్టుబడుల కారణంగా ఈ వాహనాలను దేశంలో నిలిపివేయడానికి కొన్ని కారణాలు కావచ్చు అని తెలిపింది.

also read మొదటిసారిగా హోండా బిఎస్ 6 వాహన ధర పెంపు....

ఫోర్త్ జనరేషన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్‌తో నిస్సాన్  2010 లో భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది, 2014 లో మిడ్-లైఫ్ అప్‌డేట్‌లను పొందింది. తరువాత పెద్ద ఫేస్‌లిఫ్ట్ 2017 లో వచ్చింది. నిస్సాన్ మైక్రో కారు ఫాలో-మి ఫంక్షన్‌తో ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్‌, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, స్పోర్టి ఆరెంజ్ క్యాబిన్‌కు జోడించబడ్డాయి. 1.2-లీటర్, పెట్రోల్ ఇంజన్ 76 బిహెచ్‌పి & 104 ఎన్ఎమ్ పవర్ ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌కు జోడించారు. 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ 63 బిహెచ్‌పి వద్ద 160 ఎన్‌ఎమ్‌ ఉత్పత్తి చేస్తుంది.

నిస్సాన్ సన్నీ కాంపాక్ట్ సెడాన్‌ను తన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోకు జోడించడం ద్వారా కంపెనీ తన ఉత్పత్తిని విస్తరించింది. కాంపాక్ట్ సెడాన్‌ కారు మొట్టమొదటిసారిగా 2011లో భారతదేశంలో ప్రారంభించారు.  తరువాత దానిని అప్ డేట్ చేసి  మోడల్ ను 2017 సంవత్సరంలో ప్రవేశపెట్టారు.

చైనాలో 2010లో గ్వాంగ్జౌ ఇంటర్నేషనల్ మోటార్ షోలో ప్రపంచవ్యాప్తంగా దీనిని ఆవిష్కరించారు. నిస్సాన్ సన్నీ అప్పటి ఆఫర్లో ఉన్న అత్యంత విశాలమైన కాంపాక్ట్ సెడాన్ కారు. ఈ సెడాన్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ రెండు ఆప్షన్లతో ఉన్నది. 98 బిహెచ్‌పి, 134 ఎన్ఎమ్ పవర్ ఉత్పత్తి చేస్తుంది.  ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో బిగించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios