న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ బారిన పడుతున్న వారిలో ఎక్కువగా 21 నుండి 60 ఏళ్ల వయస్సున్నవారేనని  కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ వైరస్ సోకిన వారిలో ఎక్కువగా 60 ఏళ్లు దాటిన వారు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని వైద్యులు చెబుతున్నారు. 

కరోనా వైరస్ సోకిన బాధితులకు సంబంధించిన ప్రోఫైల్స్ ను కేంద్రం శనివారం నాడు విడుదల చేసింది. శనివారం నాడు ఉదయం దేశంలో సుమారు 2902 మందికి కరోనా సోకింది. వీరిలో 68 మంది మృతి చెందారు.

దేశంలోని 21 నుండి 40 ఏళ్ల వయస్సున్న వారికి 41.8 శాతం కరోనా వైరస్ సోకినట్టుగా కేంద్రం ప్రకటించింది. 41 ఏళ్ల నుండి 60 ఏళ్ల వయస్సున్న వారికి 16.69 శాతం కరోనా వైరస్ సోకినట్టుగా గణాంకాలు తెలుపుతున్నాయి. 

కరోనా వైరస్ సోకిన వారిలో 58 మంది పరిస్థితి విషమంగా ఉందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేరళ, మధ్యప్రదేశ్ ,ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన రోగుల పరిస్థితి విషమంగా ఉందని కేంద్రం తెలిపింది.

దేశంలో ఇప్పటివరకు మృతి చెందిన వారిలో వృద్దులు ఎక్కువగా  ఉన్నారు. జనవరి నుండి ఇప్పటివరకు 2902 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో చనిపోయిన వారిలో 68 మంది వృద్దులు ఉన్నట్టుగా కేంద్రం  స్పష్టం చేసింది. 

Also read:ఫ్లోర్ లీడర్ల భేటీ: ప్రధాని మోడీపై విరుచుకుపడ్డ అసదుద్దీన్ ఓవైసీ

బీపీ, షుగర్, డయాబెటిస్ వంటి సమస్యలు ఉన్న వృద్దులు ఎక్కువగా  ఈ వైరస్ సోకిన రోగులు మృతి చెందినట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రటకించింది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకుగాను అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది.