కరోనా పాజిటివ్ గా తేలిన ట్రైనీ ఐఎఫ్ఎస్ ఆఫీసర్

తాజాగా మరో ఐఎఫ్ఎస్ ట్రైనీకి కరోనా పాజిటివ్ అని తేలడం ఇప్పుడు డెహ్రాడూన్ లో భయాందోళనలకు దారితీస్తోంది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ నగరంలోని ఐఎఫ్ఎస్ ట్రైనింగ్ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

Another Trainee IFS Officer tests positive for corona

కరోనా అని మామూలుగా అనడం కంటే...ఇప్పుడు ఈ వైరస్ ని మహమ్మారి అని పిలవడం కరెక్ట్ ఏమో! ఈ వైరస్ విలయతాండవానికి భారత్ వణికిపోతుంది. ఇటలీ, అమెరికాలు వచ్చిన పరిస్థితి రాకూడదని ఇప్పటికే దేశమంతా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఈ వైరస్ కి తన, మన, పర అన్న బేధం లేకుండా ఎవ్వరికి పడితే వారికి సోకుతుంది. అందుకోసమనే ఈ వైరస్ పేరు చెబితేనే ప్రజలు వణికిపోతున్నారు. భారతదేశంలో ఇప్పటికే ఒక ఐఎఫ్ఎస్ అధికారికి కరోనా పాజిటివ్ అని తేలిన విషయం తెలిసిందే. 

తాజాగా మరో ఐఎఫ్ఎస్ ట్రైనీకి కరోనా పాజిటివ్ అని తేలడం ఇప్పుడు డెహ్రాడూన్ లో భయాందోళనలకు దారితీస్తోంది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ నగరంలోని ఐఎఫ్ఎస్ ట్రైనింగ్ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

మొత్తంగా ఇద్దరికి కరోనా లక్షణాలు ఉండడంతో వారికి టెస్టులు నిర్వహించారు. అందులో ఒకరికి మాత్రమే పాజిటివ్ గా తేలింది. వెంటనే ఆ సదరు అధికారిని ఇసోలాటిన్ వార్డుకి తరలించారు. అక్కడ వైద్యులు అతడిని ప్రత్యేక గదిలో పర్యవేక్షిస్తూ ట్రీట్మెంట్ ని అందిస్తున్నారు. 

ఇకపోతే... ఈనెల ఆరంభంలో కరోనా పాజిటివ్ గా తేలిన మరో ఐఎఫ్ఎస్ ట్రైనీ పూర్తిగా కోలుకున్నాడు. అతడికి కరోనా పూర్తిగా తగ్గినట్టు రిపోర్ట్ రావడంతో అతడిని డిశ్చార్జ్ చేసారు. చికిత్స అనంతరం నిర్వహించిన పరీక్షల్లో అతడు కరోనా నెగటివ్ అని తేలడంతో డిశ్చార్జ్ చేసినట్టు వైద్యులు తెలిపారు. 

మరో ట్రైనీ కూడా పాజిటివ్ అని తేలడంతో శిక్షణ కేంద్రాన్ని అంతా మరోమారు శానిటైజ్ చేసారు. ఇప్పటికే అక్కడున్న ట్రైనీలకు కరోనా అవగాహనపై ప్రత్యేకంగా క్లాసులు కూడా నిర్వహించారు. 

ఇకపోతే... కరోనా పాజిటివ్‌గా తేలి భారతీయ చిత్ర పరిశ్రమను ఆందోళనకు గురిచేశారు బాలీవుడ్ సింగర్ కనికా కపూర్. లండన్ నుంచి తిరిగొచ్చిన తర్వాత ఆమె పార్టీలకు హాజరై విమర్శలను మూటగట్టుకున్నారు.

ఈ నేపథ్యంలో కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరి పాజిటివ్‌గా తేలారు. అప్పటి నుంచి కనికా ఉత్తరప్రదేశ్‌లోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతున్నారు.

Also Read:యూపీ టు యూకే.. వైరల్ అవుతున్న కనికా, ప్రిన్స్‌ చార్లెస్‌ ఫోటోలు

అయితే 10 రోజులుగా చికిత్స తీసుకుంటున్నప్పటికీ ఆమె ఆరోగ్య పరిస్ధితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. వైద్యులు నాలుగోసారి చేసిన కరోనా పరీక్షల్లో కూడా కనికా కపూర్‌కు పాజిటివ్‌గా తేలడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.

ఇదే సమయంలో ఆమె ట్రీట్‌మెంట్‌కు సైతం స్పందించకపోవడంతో తాము చాలా కంగారు పడుతున్నామని కనికా కుటుంబసభ్యుడు ఒకరు మీడియాకు తెలిపారు. ప్రస్తుతం లాక్‌డౌన్ నేపథ్యంలో ఆమెను చికిత్స నిమిత్తం విదేశాలకు కూడా తీసుకెళ్లలేమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read:ముదురుతున్న కనికా వ్యవహారం.. ఇంక దొరకని ఆమె స్నేహితుడు

కనికా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధించడం తప్పించి ఇంకేమీ చేయలేమని అతను అన్నారు. అయితే వైద్యులు మాత్రం కనికా పరిస్థితి నిలకడగానే ఉందని అంటున్నారు. కాగా మార్చి 9న లండన్ నుంచి ముంబై వచ్చిన కనికా కపూర్ అక్కడి నుంచి కాన్పూర్, లక్నో వెళ్లారు.

అక్కడ ఓ విందులో ప్రముఖులతో కలిసి పాల్గొన్నారు. ఆ తర్వాత దగ్గు, జ్వరంతో బాధపడుతుండటంతో కుటుంబసభ్యులు కనికాను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చేసిన పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్‌గా తేలింది. లండన్ నుంచి వచ్చిన తర్వాత క్వారంటైన్‌లో ఉండకుండా పార్టీలకు హాజరవ్వడం పట్ల మీడియా, ప్రభుత్వం, వైద్యులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios