ఢిల్లీ క్యాన్సర్ ఆసుపత్రిలో పనిచేసిన 18 మందికి కరోనా
ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న క్యాన్సర్ ఆసుపత్రిలో పనిచేసిన డాక్టర్లు, నర్సులకు 18 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ ఆసుపత్రిని ప్రభుత్వం మూసివేసింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న క్యాన్సర్ ఆసుపత్రిలో పనిచేసిన డాక్టర్లు, నర్సులకు 18 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ ఆసుపత్రిని ప్రభుత్వం మూసివేసింది.
క్యాన్సర్ ఆసుపత్రిలో పనిచేసిన డాక్టర్ కు మంగళవారం నాడు కరోనా పాజిటివ్ సోకినట్టుగా నిర్ధారణ అయింది. ఈ ఆసుపత్రిలో పనిచేసిన వైద్యులకు కరోనా సోకడంతో ఈ ఆసుపత్రిని గత వారంలో మూసివేసింది ప్రభుత్వం.
ఈ ఆసుపత్రిలో పనిచేసిన 11 మంది నర్సులకు కూడ కరోనా వైరస్ సోకింది. ఈ ఆసుపత్రిలో పనిచేసిన మరో ఏడుగురు డాక్టర్లకు కూడ కరోనా సోకింది. దీంతో ఈ ఆసుపత్రిలో పనిచేసిన డాక్టర్లు, నర్సులకు 18 మందికి కరోనా సోకింది.మరో వైపు ఈ ఆసుపత్రిలో పనిచేసే 19 మందికి శాంపిల్స్ ను కూడ వైద్యులు ల్యాబ్ కు పంపారు. ఈ రిపోర్టు కోసం వైద్యులు ఎదురు చూస్తున్నారు.
ఈ ఆసుపత్రిలో పనిచేసే వైద్యుడికి తొలుత కరోనా సోకింది. యూకే నుండి వచ్చిన బంధువుల నుండి ఈ డాక్టర్ కు ఈ వ్యాధి సోకింది. దీంతో మరో డాక్టర్ కి కూడ కరోనా వైరస్ సోకింది.
Also read:ఫేక్ న్యూస్ పోస్టు చేసిన కిరణ్ బేడీ: నెటిజన్ల ఆగ్రహం
ఈ డాక్టర్ తో పాటు నర్సులకు కూడ ఈ వైరస్ వ్యాపించిందనే అనుమానాలను డాక్టర్లు అభిప్రాయపడ్డారు. దీంతో 45 సిబ్బంది క్వారంటైన్ చేశారు.ఢిల్లీలోని మొహల్లాలో ప్రభుత్వం నిర్వహిస్తున్న క్లినిక్ లో పనిచేసిన డాక్టర్ దంపతులకు కూడ కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే,
ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు సోమవారం నాటికి 532కి చేరుకొన్నాయి. ఈ వ్యాధితో ఏడుగురు మృతి చెందారు. దేశ వ్యాప్తంగా 111 మరణించారు.