ఫేక్ న్యూస్ పోస్టు చేసిన కిరణ్ బేడీ: నెటిజన్ల ఆగ్రహం

సోషల్ మీడియాలో అవసరమైన వాటి కంటే అనవసర అంశాలు ఎక్కువగా షేర్ చేస్తున్నారు. అంతేకాదు నిజమైన వాటి కంటే ఫేక్ న్యూస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి.  

Kiran Bedi posts fake forward on egg and chicken. Uninstall WhatsApp, says Twitter

పుదుచ్చేరి: సోషల్ మీడియాలో అవసరమైన వాటి కంటే అనవసర అంశాలు ఎక్కువగా షేర్ చేస్తున్నారు. అంతేకాదు నిజమైన వాటి కంటే ఫేక్ న్యూస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి.  కొందరు ప్రముఖులు కూడ ఫేక్ న్యూస్ ను కూడ నమ్ముతున్నారు. పొరపాటున అలాంటి న్యూస్ ను  సోషల్ మీడియాలో షేర్ చేసి ఆ తర్వాత ఇబ్బంది పడుతున్నారు.

ప్రపంచంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ వ్యాధి నివారణ కోసం ప్రపంచ దేశాలు అన్ని రకాల చర్యలు తీసుకొంటుంది. సోషల్ మీడియాలో కరోనాపై తప్పుడు ప్రచారం చేయవద్దని ప్రభుత్వాలు కోరుతున్నాయి. అయితే తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకొంటామని కూడ ప్రభుత్వాలు హెచ్చరించిన విషయం తెలిసిందే.

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ  ట్విట్టర్ లో షేర్ చేసిన వీడియోపై నెటిజన్లు మండిపడ్డారు. ఫేక్ వీడియోను షేర్ చేసిన కిరణ్ బేడీ నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు.

 

కోడిగుడ్డు వల్ల కరోనా వస్తుందన్న మూఢ నమ్మకంతో మనం వాటిని పడేస్తున్నాం, అయితే అవన్నీ ఒక వారం తర్వాత పొదిగి ఇలా కోడిపిల్లలు అవుతాయి. ఇది సృష్టి స్వభావం. జీవితానికి దాని స్వంత మార్గాలుంటాయి. అంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

కిరణ్ బేడీ సోషల్ మీడియాలో ఫేఖ్ వీడియో షేర్ చేశారని మండిపడుతున్నారు. తినడానికి ఉపయోగించే కోడిగుడ్లు పిల్లలను ఎలా పొదుగుతాయని నెటిజన్లు ప్రశ్నించారు. ఫేక్ న్యూస్ పోస్టు చేసే ముందు ఆలోచించాలని నెటిజన్లు  సూచించారు. వాట్సాప్ ను అన్ స్టాల్ ను చేయాలని కిరణ్ బేడీని నెటిజన్లు కోరుతున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios