ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో భారతదేశం మానవాళికి అందించిన యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో ప్రధాని నరేంద్రమోడీ  సైతం ఈ 21 రోజుల కాలంలో యోగా చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న సంగతి తెలిసిందే.

తనకెప్పుడు ఖాళీ సమయం లభించినా యోగ నిద్ర ఆసనం వేస్తుంటానని ఇది ఒత్తిడిని తొలగిస్తుందని మోడీ ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన త్రీడి వీడియోలను కూడా ప్రధాని జత చేశారు. దీనిపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ప్రధానికి థాంక్స్ చెప్పారు.

Also Read:కరోనా లాక్ డౌన్... నన్ను రక్షిస్తోంది ఇదే.. మోదీ వీడియో

'ఆదివారం నిర్వహించిన మన్‌కీబాత్‌ కార్యక్రమం సందర్భంగా  ప్రస్తుత సమయంలో  నా ఫిట్‌నెస్‌ దినచర్య గురించి ఒకరు నన్ను అడిగారు.  అందుకే యోగా వీడియోలను షేర్‌ చేయాలనే ఆలోచన వచ్చింది.

మీరందరూ కూడా యోగాను రెగ్యులర్‌గా ప్రాక్టీస్‌ చేస్తారని అనుకుంటున్నానని' మోదీ ట్వీట్‌ చేశారు. తాను యోగా చేస్తున్న దృశ్యాల తాలూకు యానిమేటెడ్ వీడియోలను ఆయన విడుదల చేశారు. కాగా భారతదేశంలో ఇప్పటి వరకు 1251 మందికి కరోనా సోకగా, 32 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Also Read:డ్యూటీయే ప్రాణం.. పై అధికారులు వద్దంటున్నా: 450 కిలోమీటర్లు నడిచిన కానిస్టేబుల్

వైరస్ సోకిన వారిలో 102 మంది రికవరీ అయ్యారు. 24 గంటల్లో దేశవ్యాప్తంగా 227 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. మాస్క్‌లు, శానిటైజర్లు, వైద్య పరికరాల కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.