దేశంలో 722కు చేరిన కరోనా కేసులు: 16 మంది మృతి, రాష్ట్రాలవారీగా లెక్కలు ఇవీ..

దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 722కి చేరుకుంది. దేశంలో ఇప్పటి వరకు 16 మంది కరోనా బారిన పడి మరణించారు. కరోనా కేసుల నమోదు విషయంలో కేరళ మహారాష్ట్రను అధిగమించింది.

88 new cases take Coronavirus count reaches 722 in India, 16 dead

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ సోకినవారి సంఖ్య 700 దాటింది. కొత్తగా 88 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 722కు చేరుకుంది. వారిలో 47 మంది విదేశీయులు ఉన్నారు. 42మందికి కరోనా వ్యాధి నయం కావడంతో వారిని డిశ్చార్జీ చేశారు. దేశంలో కరోనా మృతుల సంఖ్య 16కు చేరుకుంది.

కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో కేరళ మహారాష్ట్రను దాటేసింది. కేరళలో అత్యధికంగా 137 కేసులు నమోదైంది. మహారాష్ట్ర 125 కేసులతో రెండు స్థానంలో నిలచింది. ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక, తెలంగాణ ఉన్నాయి. రాష్ట్రాలవారీగా కరోనా వైరస్ లెక్కలు ఇలా ఉన్నాయి...

Also Read: కరోనా లాక్ డౌన్: పాలు కొనడానికి వెళ్లిన వ్యక్తి పోలీసుల లాఠీచార్జిలో మృతి

కేరళ 137
మహారాష్ట్ర 125, మరణాలు 3
కర్ణాటక 55, మరణాలు 3
తెలంగాణ 44
గుజరాత్ 43, మరణాలు 3
ఉత్తరప్రదేశ్ 42
రాజస్థాన్ 40
ఢిల్లీ 36, మరణాలు 1
పంజాబ్ 33, మరణాలు 1
హర్యానా 32
తమిళనాడు 29, మరణాలు 1
మధ్యప్రదేశ్ 20, మరణాలు 1
జమ్మూ, కాశ్మీర్ 14, మరణాలు 1
లడక్ 13
ఆంధ్రప్రదేశ్ 11
పశ్చిమ బెంగాల్ 10, మరణాలు 1
బీహార్ 7, మరణాలు 1
చండీగడ్ 7
చత్తీస్ గడ్ 6
ఉత్తరాఖండ్ 6
గోవా 3
హిమాచల్ ప్రదేస్ 3, మరణాలు 1
ఒడిశా 3
అండమాన్ నికోబార్ 1
మణిపూర్ 1
మిజోరం 1
పుదుచ్చేరి 1

ఇదిలావుంటే, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శుక్రవారం రాష్ట్రాల గవర్నర్లతో, లెఫ్టినెంట్ గవర్నర్లతో మాట్లాడున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఇందులో పాల్గొనే అవకాశం ఉంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios