కరోనా లాక్ డౌన్: పాలు కొనడానికి వెళ్లిన వ్యక్తి పోలీసుల లాఠీచార్జిలో మృతి
పోలీసులు సైతం తమ అధికార ఝులుమ్ ని ప్రదర్శిస్తున్నారు. పోలీసుల విచక్షణారహిత దాడి వల్ల పాలు కొనడానికి బయటకు వెళ్లిన వ్యక్తి పోలీసుల లాఠీ చార్జీలో గాయపడి మృతి చెందాడు.
ప్రపంచమంతా కరోనా వైరస్ బారినపడి బయటపడలేక కొట్టుమిట్టాడుతుంది. అంతకంతకు పెరుగుతున్న కేసులు, మరణాలతో ప్రపంచ దేశాల ప్రభుత్వాలు ఏమి చేయాలో అర్థం కాక తలలు బద్దలు కొట్టుకుంటున్నాయి.
భారతదేశంలో కూడా ఈ కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తుంది. వైరస్ కోరలు చాస్తున్నవేళ ప్రధాని మోడీ దేశమంతా 21 రోజుల సంపూర్ణ లాక్ డౌన్ ను ప్రకటించారు. మోడీ సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించేకన్నా ముందే.... దేశంలోని చాలా వరకు రాష్ట్రాలు లాక్ డౌన్ ని ప్రకటించివేశాయి.
ఈ లాక్ డౌన్ సందర్భంలో కొందరు ప్రజలు ఒకింత నిబంధనలు ఉల్లంఘిస్తున్నమాట వాస్తవమే అయినా... పోలీసులు సైతం తమ అధికార ఝులుమ్ ని ప్రదర్శిస్తున్నారు. పోలీసుల విచక్షణారహిత దాడి వల్ల పాలు కొనడానికి బయటకు వెళ్లిన వ్యక్తి పోలీసుల లాఠీ చార్జీలో గాయపడి మృతి చెందాడు.
వివరాల్లోకి వెళితే... హౌరా జిల్లాకు చెందిన లాల్ స్వామి పాలు కోనక్క రావడానికి బయటకు వెళ్ళాడు. అదే సమయంలో పోలీసులు అక్కడ ఉన్న గుంపు పైన లాఠీ ఛార్జ్ చేయడంతో... గాయాలపాలైన అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకురావడంతోనే... అతడు అదివరకే మరణించాడని డాక్టర్లు తేల్చారు.
పోలీసులు విచక్షణారహితంగా కొట్టబట్టే తన భర్త చనిపోయాడని అతని భార్య ఆరోపిస్తుండగా.... పోలీసులు మాత్రం అతను గుండెనొప్పితో చనిపోయాడని అంటున్నారు.
ఇకపోతే లాక్ డౌన్ సందర్భంగా కొందరు ఇదే అదునుగా పరిస్థితులను అందిపుచ్చుకొని రేట్లు పెంచేస్తున్నారు. వీరికి అడ్డుకట్ట వేయడానికి తెలంగాణ ప్రభుత్వం పూనుకుంది.
వారి ఆగడాలను కట్టడి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కఠినమైన నిర్ణయం తీసుకుంది. కూరగాయల ధరలను ప్రకటించింది. ఆ ధరలను మించి ఎక్కువకు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధపడింది. అధిక దరలు అమ్మినవారి గురించి 1902 నెంబర్ కు కాల్ చేయాలని సూచించింది.
ఆ నెంబర్ కు కాల్ చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన కూరగాయల ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి. పప్పు ధాన్యాల ధరలను కూడా నిర్ణయించి ప్రకటించింది. పప్పు ధాన్యాల ధరలనే కాకుండా జొన్నలు, సజ్జలు, రాగులు వంటి ధాన్యాల ధరలను కూడా ప్రకటించింది.
కూరగాయలు…
వంకాయ- రూ.30 కేజీ
బెండకాయ- రూ.40 కేజీ
టమాట- రూ.10 కేజీ
అరటికాయ- రూ.40 కేజీ
కాలిఫ్లవర్- రూ.40 కేజీ
క్యాబేజి- రూ.23 కేజీ
పచ్చిమిర్చి- రూ.60 కేజీ
చిక్కుడుకాయ- రూ.45 కేజీ
బీరకాయ- రూ.60 కేజీ
క్యారెట్- రూ.60 కేజీ
ఆలుగడ్డ- రూ.30 కేజీ
ఉల్లిపాయలు(తెల్లవి)- రూ.30 కేజీ
ఉల్లి(ఎర్రవి)- రూ.35 కేజీ
వెల్లుల్లి- రూ.160 కేజీ
అల్లం- రూ.220 కేజీ
ఆకు కూరల రేట్లు ఇలా ఉన్నాయి..
ఆకు కూరలు
పాలకూర- కిలో రూ.40
తోటకూర- కిలో రూ.40
కొత్తిమీర- కిలో రూ.60
మెంతికూర- కిలో రూ.60
నిత్యావసర వస్తువుల రేట్లు..
పప్పు, ఇతర ధాన్యాల ధరలు
కందిపప్పు(గ్రేడ్1)- కిలో రూ.95
మినపపప్పు- కిలో రూ.140
పెసరపప్పు- కిలో రూ.105
శెనగపప్పు- కిలో రూ.65
సజ్జలు- కిలో రూ.30
గోధుమలు- కిలో రూ.36,
జొన్నలు- కిలో రూ.38
రాగులు- కిలో రూ.40