అమెరికా రివైవల్‌కు ట్రంప్ టీమ్ ఇదే... ఆరుగురు ఇండియన్లకు చోటు

అమెరికా ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజితం చేసేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. ఇందుకు తగిన సలహాలు ఇవ్వాలంటూ అమెరికాలోని పారిశ్రామిక వేత్తలు, నిపుణులను కోరారు. వివిధ రంగాలకు చెందిన 200 మంది ప్రముఖులతో ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
 
6 Indian-Americans got place on Trump's List of Economic Advisers
వాషింగ్టన్: కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించిన తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థను పరుగులెత్తించేందుకు అనుసరించాల్సిన విధి విధానాలపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ టీమ్ ఏర్పాటు చేశారు. ఈ విషయమై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తదితరులు డొనాల్డ్ ట్రంప్‌కు సలహాలు సూచనలు ఇవ్వనున్నారు. 

ఈ విషయాన్ని ట్రంప్‌ స్వయంగా వైట్ హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజితం చేసేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. ఇందుకు తగిన సలహాలు ఇవ్వాలంటూ అమెరికాలోని పారిశ్రామిక వేత్తలు, నిపుణులను కోరారు. వివిధ రంగాలకు చెందిన 200 మంది ప్రముఖులతో ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

వ్యవసాయం, బ్యాంకింగ్, నిర్మాణం, రక్షణ, ఇంధన, ఆర్థిక సేవలు, ఆహార ఉత్పత్తులు, ఆరోగ్యం, సేవలు, పారిశ్రామిక రంగం, రిటైల్, టెక్నాలజీ, టెలికమ్యునికేషన్, రవాణా, తదితర రంగాల అభివృద్ధకి ఏం చేయాలనే దానిపై అగ్రరాజ్యాధినేతకు వీరు తమ  సూచనలు చేయనున్నారు.

 ‘నా అభ్రిప్రాయం ప్రకారం వీరందరూ వారి వారి రంగాల్లో ప్రతిభావంతులు, దేశ అర్థిక వ్యవస్థను పట్టాలేక్కించేందుకు వారు మనకు కొత్త కొత్త సలహాలు ఇస్తారు’ అని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

also read  లాక్ డౌన్ పొడిగించడం సరే...మా ప్యాకేజీ సంగతేమిటి..?: కార్పొరేట్ ఇండియా

యాపిల్ సీఈఓ టిమ్ కుక్, ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్, టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ వంటి ఎందరో ప్రముఖలు అధ్యక్షుడి సలహాదారులుగా వ్యవహరించనున్నారు. 

సత్యనాదేళ్ల, సుందర్ పిచాయ్‌తోపాటు ఐబీఎం సీఈఓ భారతీయ సంతతికి చెందిన అరవింద్ కృష్ట (ఐబీఎం), సంజయ్ మెహ్రోత్రా(మైక్రాన్) తదితరులు ఉన్నారు. ట్రంప్ టీంలో భారత సంతతికి చెందిన ఆరుగురు ప్రముఖులకు స్థానం లభించింది. 

ఒక్కో రంగం అభివృద్ధికి కోసం ఆయా రంగంలోని నిపుణులు ట్రంప్‌కు సూచనలు సలహాల రూపంలో తోడ్పాటునందించనున్నారు.పెర్నార్డ్ రికార్డు బివరేజ్ కంపెనీ సీఈఓ ఆన్ ముఖర్జీ.. ఉత్పత్తి రంగ పునరుత్తేజ టీం, మాస్టర్ కార్డ్ సీఈఓ అజయ్ బంగా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ టీంలలో సభ్యులుగా ఉన్నారు.

బ్యాంకింగ్, నిర్మాణం, కార్మికశాఖ, రక్షణ, ఇంధనం, ఆర్థిక సేవలు, ఆరోగ్యం, పర్యాటక రంగం, తయారీ, స్థిరాస్థీ, రిటైల్, టెక్నాలజీ, రవాణా, క్రీడలు తదితర రంగాలకు ఒక్కో టీమ్ ఏర్పాటు చేశారు. ఆయా రంగాల నిపుణుల సలహాలు తీసుకోనున్నారు. అమెరికాలోని రెండు పార్టీలు వేర్వేరుగా దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్దరణకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నాయి. 
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios