Asianet News TeluguAsianet News Telugu

భారతీయుల భుజంపై మచ్చ.. డబ్ల్యూహెచ్‌వో ప్రయోగాలు: కరోనా నుంచి అదే కాపాడుతోందా..?

మన చుట్టూ వున్న చాలా మందికి ఎడమ చేతి భుజానికి సమీపంలో తెనే రంగుంలో గుండ్రని మచ్చ కనిపిస్తుంది. అదే మరేమిటో కాదు.. చిన్నప్పుడు వేసిన బీసీజీ టీకా గుర్తు. అయితే ఇప్పుడు ఆ మచ్చే ఎంతో మందిని కరోనా మహమ్మారి బారి నుంచి కాపాడుతుందని అంటున్నారు పరిశోధకులు.

100-Year Old BCG vaccine A Potential New Tool To Fight Against COVID-19
Author
New Delhi, First Published Apr 2, 2020, 2:26 PM IST

మన చుట్టూ వున్న చాలా మందికి ఎడమ చేతి భుజానికి సమీపంలో తెనే రంగుంలో గుండ్రని మచ్చ కనిపిస్తుంది. అదే మరేమిటో కాదు.. చిన్నప్పుడు వేసిన బీసీజీ టీకా గుర్తు. అయితే ఇప్పుడు ఆ మచ్చే ఎంతో మందిని కరోనా మహమ్మారి బారి నుంచి కాపాడుతుందని అంటున్నారు పరిశోధకులు.

భారతదేశంలో బీసీజీ టీకా వేసుకోని వారు దాదాపుగా ఉండరు. ప్రభుత్వం బిడ్డ పుట్టిన తర్వాత వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ టీకాను తప్పనిసరి చేసింది. ఒకప్పుడు దేశాన్ని వణికించిన క్షయ వ్యాధి చిన్నారులకు రాకుండా చిన్నతనంలోనే దీనిని వేసేవారు.

Also Read:ఇండియాపై కరోనా దెబ్బ: 50 మంది మృతి, 1965కి చేరుకొన్న కేసులు

ఈ బీసీజీ ( బాసిల్లస్ కాల్మెట్టే.. గ్యూరిన్) టీకా వల్ల కరోనా భారతీయులపై అంతగా ప్రభావం చూపించడం లేదని పరిశోధకలు అంటున్నారు. బాల్యంలో ఈ బీసీజీ టీకా వేసుకున్న వారికి కోవిడ్ 19 ముప్పు తక్కువని అంటున్నారు.

ప్రస్తుతం కరోనా కరాళా నృత్యం చేస్తున్న ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో చాలా కాలం కిందటే బీసీజీ టీకాలను నిలిపివేయడమో, వేయకపోవడమో జరిగిందని తాజా అధ్యయనంలో శాస్త్రవేత్తలు గుర్తించారు.

అయితే భారత్, చైనా వంటి దేశాలు మాత్రం బీసీజీ టీకాలు వేస్తూనే ఉన్నారు. ఈ టీకా కారణంగానే ఆయా దేశాల్లో మరణాల రేటు తక్కువగా ఉందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read:కరోనా పరీక్షలు... డాక్టర్లను చితకబాది..

భారతదేశంలో చిన్నారులకు బీసీజీ టీకాలు వేయడాన్ని 1949 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. అదే ఇరాన్‌‌ బీసీజీ టీకాల పాలసీ 1984 నుంచి ప్రారంభించారు. అందుకే అక్కడ కోవిడ్ 19 మరణాల రేటు అధికంగా ఉందని అంటున్నారు. కాగా బీసీజీ టీకాను ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని హెల్త్ కేర్ వర్కర్లపై ప్రయోగించారు. వారెవ్వరికీ కరోనా సోకలేదు.

టీబీ రాకుండా వేసే ఈ వ్యాక్సిన్స్‌ను బ్లాడర్ క్యాన్సర్ మొదటి దశలో కామన్ ఇమ్యూనోథెరపీ కింద కూడా ఇచ్చేవారు. టీబీ వైరస్ లోపలికి రాకుండా ఈ వ్యాక్సిన్ అడ్డుగోడలా అడ్డుకుంటుంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ బీసీజీ టీకాపై మరింత పరిశోధనలు జరపాలని సూచించింది.

Follow Us:
Download App:
  • android
  • ios