లాంగ్ రైడ్స్‌కి వెళ్లే ముందు ఒకోసారి మనం కారు గురించి పట్టించుకోము. కారును చెక్ చేసే సమయంలో మీ కారు ఎక్కువ వేడెక్కుతుంటే ఇది ప్రమాద సంకేతం కావొచ్చు. కాబట్టి కారు నడుపుతున్నప్పుడు, కారు వేడెక్కినప్పుడు మీరు కొన్ని నియమాలను పాటించాలి.

ఇంజన్ ఉష్ణోగ్రత హై వార్నింగ్ సింబల్ ప్యానెల్‌లోని 'హెచ్' గుర్తుకు చేరుకుంటే, మీరు ఈ వార్నింగ్ సింబల్ పై జాగ్రత వహించాలి. అటువంటి పరిస్థితిలో, మీ కారులోని ఎయిర్ కండీషనర్ ఆన్‌లో ఉంటే, వెంటనే దాన్ని స్విచ్ ఆఫ్ చేయాలి. మీ వాహనాన్ని సురక్షితమైన ప్రదేశంలో పార్క్ చేయండి.

ఇంజిన్ ఉష్ణోగ్రత తగ్గే వరకు అంటే సూచిక 'హెచ్' నుండి 'సి' మార్క్ మధ్య సాధారణ పరిధిలోకి వచ్చే వరకు ఇంజన్ కొన్ని నిమిషాలు సాధారణ వేగంతో నడపలి. బోనెట్ కింద నుండి ఆవిరి వస్తున్నట్లు మీకు అనిపిస్తే వెంటనే వాహనాన్ని సురక్షితమైన స్థలంలో ఆపి, వెంటనే ఇంజన్ ఆపివేయండి.

also read జెస్ట్ మనీతో ఒకినావా చేతులు.. కస్టమర్ల ఈఎమ్ఐ సమస్యలు మరింత ఈజిగా..

ఆవిరి ఆగే వరకు బోనెట్ తెరవవద్దు. ఆవిరి తగ్గినప్పుడు, రానప్పుడు లేదా కనిపించనప్పుడు బోనెట్ తెరిచి ఏదైనా సమస్య ఉంటే వాటర్ పంప్ బెల్ట్‌ను చెక్ చేయండి.

వాటర్ కూలర్ లెవెల్ చెక్ చేయండి. ఇది స్టార్టింగ్ మార్కు కంటే తక్కువగా ఉంటే వాటర్ పంప్ లేదా రేడియేటర్ నుండి లీకేజ్ ఉందేమో చెక్  చేయండి. ఏదైనా లీకేజ్ ఉంటే, లీకేజీని సరి చేసిన తర్వాత మాత్రమే ఇంజన్ను ఆన్ చేయండి. మీకు లీకేజీ కనిపించకపోతే, నెమ్మదిగా వాటర్ లెవెల్ తక్కువ ఉంటే నింపండి. 

ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు రేడియేటర్ క్యాప్ తొలగించడం లేదా ఓపెన్ చేయడం  ప్రమాదకరం. ఇది తీవ్రమైన గాయాలకు లేదా ప్రాండానికి కారణమవుతుంది. ఇంజన్ వేడి కొంచెం సాధారణ స్థాయికి వచ్చాక కారును సర్వీస్ సెంటర్ కి వెంటనే తీసుకెళ్లండి, తద్వారా ప్రమాదాన్ని నియంత్రించవచ్చు.