మీ కారు/బైకుకి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ విరిగిపోయిందా.. అయితే ఏం చేయాలో ఈ నియమాలను తెలుసుకోండి..
హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్( హెచ్‌ఎస్‌ఆర్‌పి ) పై నియమాలు చాలా కఠినంగా మారాయి. వాహన యజమానులు చివరి తేదీకి ముందే తమ వాహనాలకి హెచ్‌ఎస్‌ఆర్‌పిని ఇన్‌స్టాల్ చేయడానికి ఇదే కారణం. 1 ఏప్రిల్ 2019 నుండి దేశంలోని అన్ని కొత్త వాహనాలకి హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ ఏర్పాటు చేయడం ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
మీ బైక్ లేదా కారుకి హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (హెచ్‌ఎస్‌ఆర్‌పి) విరిగిపోయింద లేదా ఎవరైనా దొంగిలించారా, ఒకవేళ అలా జరిగితే ఏం చేయ్యలి..? ఈ ప్రశ్న ఇప్పుడు అవసరం ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది వాహన యజమానులు ఈ సమస్యతో బాధపడుతున్నారు.
హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్( హెచ్‌ఎస్‌ఆర్‌పి ) పై నియమాలు చాలా కఠినంగా మారాయి. వాహన యజమానులు చివరి తేదీకి ముందే తమ వాహనాలకి హెచ్‌ఎస్‌ఆర్‌పిని ఇన్‌స్టాల్ చేయడానికి ఇదే కారణం.
1 ఏప్రిల్ 2019 నుండి దేశంలోని అన్ని కొత్త వాహనాలకి హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ ఏర్పాటు చేయడం ప్రభుత్వం తప్పనిసరి చేసింది, కానీ ఈ నంబర్ ప్లేట్ విరిగిపోయినా లేదా దొంగిలించినా దానికి సంబంధించి కొత్త సమస్యలు తలెత్తవచ్చు.
దేశంలోని చాలా రాష్ట్రాల్లో హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (హెచ్‌ఎస్‌ఆర్‌పి) విరిగిపోయిన లేదా దొంగిలించిన వాహన యజమాని ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాల్సి ఉంటుంది.
రిపోర్ట్ కాపీని ఇచ్చిన తర్వాతే వాహనంకి కొత్త నంబర్ ప్లేట్ ఏర్పాటు చేయబడుతుంది. ఇది కాకుండా రవాణా శాఖ తరపున అనుమతి ఉన్న సంస్థ లేదా వాహన డీలర్లకు మాత్రమే హెచ్‌ఎస్‌ఆర్‌పి అందించగలదు.
నంబర్ ప్లేట్ విరిగినప్పుడు ఏం జరుగుతుంది?
ద్విచక్ర వాహనం నంబర్ ప్లేట్ విరిగితే దానిని భర్తీ చేసే అధికారం పొందిన సంస్థ లేదా వాహన డీలర్‌కు మాత్రమే ఉంటుంది. విరిగిన నంబర్ ప్లేట్ స్థానంలో వాహన యజమానులకు మాత్రమే ఛార్జీ విధించబడుతుంది.
also read బజాజ్ నుండి టివిఎస్ వరకు చౌకైన బిఎస్ 6 బైక్‌లు ఏవో తెలుసా..
రెండవ నంబర్ ప్లేట్ కూడా విరిగితే ఏమి జరుగుతుంది?
రెండవ వాహన నంబర్ ప్లేట్ విరిగితే స్టిక్కర్ ప్లేట్‌తో పాటు భర్తీ చేస్తారు. ఇందుకోసం వాహన యజమానులు అదనపు చార్జ్ చెల్లించాల్సి ఉంటుంది.
స్టిక్కర్ ప్లేట్ దెబ్బతిన్నట్లయితే ?
స్టిక్కర్ ప్లేట్ దెబ్బతింటే, అది మాత్రమే భర్తీ చేస్తారు . దీని కోసం, వాహన యజమానుల నుండి స్టిక్కర్ ప్లేట్ చార్జి వసూలు చేస్తారు.
హెచ్‌ఎస్‌ఆర్‌పిని ఇన్‌స్టాల్ చేయడానికి ఎంత ఖర్చవుతుంది?
వివిధ వాహనాలకు హెచ్‌ఎస్‌ఆర్‌పి ధరలు భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు ఒక కారుకి హెచ్‌ఎస్‌ఆర్‌పిని ఇన్‌స్టాల్ చేయాలంటే అందుకు రూ.600 నుండి రూ.1000 మధ్య ఖర్చు అవుతుంది. అదే ద్విచక్ర వాహనాలకు మాత్రం రూ.300 నుండి రూ.400 ఖర్చువుతుంది.