ఇండియన్ విపణిలోకి టయోటా ‘వెల్‌ఫైర్’.. తొలి లగ్జరీ హైబ్రీడ్ కారు కూడా..
భారత దేశ విపణిలోకి గ్లోబల్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ ‘వెల్‌ఫైర్’ అనే మోడల్ విద్యుత్ ఆధారిత లగ్జరీ కారును ఆవిష్కరించింది. ఎగ్జిక్యూటివ్ లాంజ్ స్థాయిలో సదుపాయాలు ఉన్నాయి. సెల్ఫ్ ఛార్జింగ్ హైబ్రిడ్ ఈవీ-8 ఇది. దీని ధర రూ.79.5 లక్షలుగా నిర్ణయించారు.
ప్రపంచ స్థాయి లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘టయోటా’ తన ‘వెల్‌ఫైర్’ను భారత విపణిలోకి విడుదల చేసింది. టయోటా కిర్లోస్కర్ మోటార్ (కేటీఎం) విడుదల చేసిన ఈ సెల్ఫ్-ఛార్జింగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనం ‘వెల్‌ఫైర్’ మల్టీ పర్పస్ వేహికల్ (మినీ వ్యాన్) కానున్నది.
అంతేకాదు, భారత్ మార్కెట్‌లో టయోటా తొలి లగ్జరీ వాహనం ఇదే. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 6 లక్షల వెల్‌ఫైర్ వాహనాలను విక్రయించామని.. తాజాగా భారత విపణిలోకి విడుదల చేస్తున్నామని కేటీఎం వైస్ చైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్ తెలిపారు.
సెల్ఫ్ ఛార్జింగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాల్లో (ఈవీ) ఇంధన వినియోగం తక్కువగా ఉంటుంది. టయోటా వెల్ ఫైర్ కారు వల్ల వాయు కాలుష్యం తగ్గుతుంది. ఎలక్ట్రిక్ వాహనాల తరహాలో హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రత్యేకంగా బ్యాటరీ ఛార్జింగ్ చేయాల్సిన అవసరం లేదు.
Also Read:నో డౌట్: రూ.2000 కనుమరుగే.. బట్ అదేంలేదన్న ‘నిర్మల’మ్మ
హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాల్లో 40 శాతం దూరం, సమయం పరంగా 60 శాతం వాహనం విద్యుత్ మీదే నడుస్తుంది. కేరళ మినహా దేశ వ్యాప్తంగా ‘వెల్‌ఫైర్’ ధర రూ.79.5 లక్షలు ఉంటుంది. సమీప భవిష్యత్‌లో దేశీయ మార్కెట్‌లోకి మరో లగ్జరీ వాహనాన్ని విడుదల చేసే వీలు ఉన్నదని కేటీఎం వైస్ చైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్ అన్నారు.
వెల్‌ఫైర్ కారులోని ఇంటీరియర్లు, సీట్లు, ఇతర సదుపాయాలు పెద్ద ఎగ్జిక్యూటివ్ లాంజ్‌ని తలపించే విధంగా ఉంటాయని కేటీఎం వైస్ చైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్ పేర్కొన్నారు. 2.5 లీటర్ల గ్యాసోలిన్ హైబ్రిడ్ ఇంజిన్, డ్యుయల్ మోటర్లు ఉంటాయి. ప్రామాణిక పరిస్థితుల్లో లీటర్ పెట్రోల్‌కు 16.35 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ సోనీ తెలిపారు.
Also Read:గంటకు రూ.7కోట్లు... ప్రపంచ బిలీనియర్లలో ముకేష్ అంబానీ
నాలుగు సిలెండర్ల గ్యాసోలిన్ హైబ్రిడ్ ఇంజిన్ 115 బీహెచ్‌పీ పవర్‌ను విడుదల చేస్తుంది. గరిష్ఠ 2800-4,000 ఆర్‌పీఎం వద్ద 198 ఎన్‌ఎం టర్క్ ఉంటుంది. వెల్‌ఫైర్‌ను హైదరాబాద్‌లో దేశీయ మార్కెట్‌లోకి విడుదల చేశారు.
మూడు విడతల్లో అందుబాటులోకి వచ్చే 180 కార్లకు ఇప్పటికే బుకింగ్‌లు వచ్చాయని.. ఇందులో 20 శాతం బుకింగ్‌లు హైదరాబాద్ నుంచే జరిగాయని కేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ సోనీ తెలిపారు. అందుకే వెల్‌ఫైర్ విడుదలకు హైదరాబాద్‌ను ఎంచుకున్నామన్నారు. ఇప్పుడు కొనుగోలు చేయాలనుకునే వారు ఏప్రిల్ వరకూ వేచి ఉండాల్సిందేనని తెలిపారు.