Asianet News TeluguAsianet News Telugu

మర్రాజో x ఎర్టిగాలకు సవాల్: మార్కెట్లోకి టయోటా ఇన్నోవా క్రిస్టా జీప్లస్

టయోటా కిర్లోస్కర్ మోటార్స్ (టీకేఎం) మార్కెట్లోకి నూతన ఇన్నోవా క్రిస్టా జీ ప్లస్ వేరియంట్ కారును ఆవిష్కరించింది. ఏడు సీటర్ల వేరియంట్ ధర రూ.15.57 లక్షలు, ఎనిమిది సీటర్ల వేరియంట్ కారు రూ.15.62 లక్షలు పలుకుతోంది. మహీంద్రా మర్రాజ్జో, మారుతి సుజుకి న్యూ ఎర్టిగ మోడల్ కార్లకు టయోటా ఇన్నోవా క్రిస్టా జీ ప్లస్ గట్టి పోటీ ఇవ్వనుంది.

Toyota Innova Crysta G Plus Variant Launched In India
Author
New Delhi, First Published Mar 4, 2019, 11:28 AM IST

టొయోటా కిర్లోస్కర్‌ మోటార్స్‌ సరికొత్త ప్రారంభశ్రేణి మల్టీ పర్పస్ వెహికల్ (ఎంపీవీ) మోడల్ కారును విపణిలోకి విడుదల చేసింది. ‘ఇన్నోవా క్రిస్ట్ర జీ ప్లస్‌’ పేరుతో విడుదల చేసిన ఈ ఏడు సీటర్ల సామర్థ్యం గల ఎంపీవీ ప్రారంభ ధర రూ.15.57లక్షలుగా నిర్ణయించింది. అదే ఎనిమిది సీటర్ల మోడల్ కారు ధర రూ.15.62లక్షలు. 

దీనిలో కేవలం జీ ప్లస్‌ ట్రిమ్‌ను ప్రైవేట్, ట్రావెల్‌ కస్టమర్ల ఆర్డర్లపై పొందవచ్చు. ఇందులో రెండు ఎయిర్‌ బ్యాగ్‌లు, పార్కింగ్‌ సెన్సర్లు, హెచ్‌వీఏసీ యూనిట్‌ ఉన్నాయి. దీనికి 16 అంగుళాల అలాయ్‌ వీల్స్‌ అమర్చారు. పాత మోడల్ ‘జీఎక్స్ ట్రిమ్’ కారుతో పోలిస్తే రూ.38 వేలు అధికం. 

ఇంజిన్‌ విషయంలో పెద్దగా మార్పులేమీ లేకున్నా 2.4లీటర్‌ ఫోర్‌ సిలిండర్‌ డీజిల్‌‌ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 343ఎన్‌ఎం టార్క్‌ వద్ద 148 బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 6- స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషిన్‌ను అమర్చారు. కొత్త ఇన్నోవా జీ ప్లస్‌ కార్ల బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.  

ఎల్ఈడీ లైట్స్‌కు బదులు హలోజెన్ హెడ్ ల్యాంప్స్, మ్యూజిక్ సిస్టమ్, రేర్ డీఫోగ్గర్, ఎనిమిది సీట్ల వేరియంట్ కారులో సెంటర్ ఆర్మ్ రెస్ట్ అమర్చారు. మల్టీ సీటర్ వెహికల్స్ మాదిరిగా ఉంటూ టయోటా ఇన్నోవా క్రిస్టా జీ ప్లస్ మోడల్ కారు అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. 

మార్కెట్లో ఎంపీవీ సెగ్మెంట్లో ధరల పోటీ తీవ్రంగా ఉంది. దీంతో ఇన్నోవా క్రిస్టను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టొయోటా ఈ నిర్ణయం తీసుకొంది. ఈ సెగ్మెంట్లో మహీంద్రా మర్రాజ్జో పేరుతో కొత్త ఎంపీవీని తీసుకొచ్చింది. ఇప్పటికే మారుతీ సుజుకి ఎర్టిగా నుంచి టయోటా గట్టి పోటీని ఎదుర్కొంటున్నది. 

Follow Us:
Download App:
  • android
  • ios