2020లో లాంచ్ అయిన టాప్ 7 బెస్ట్ ఎస్‌యూవీ కార్లు ఇవే..
ఇండియాలో ఎస్‌యూవీ కార్ల మార్కెట్ గత కొంతకాలంగా గణనీయమైన వేగంతో అభివృద్ది చెందుతుంది. ఈ ధోరణి 2020లో మాత్రమే కొనసాగింది, అది కూడా కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ. కొరియా, జపనీస్ కార్ల తయారీ సంస్థలు 2020లో లాంచ్ చేసిన టాప్ 7 ఎస్‌యూవీలు అత్యధిక బుకింగులు, సేల్స్ తో వాహనదారులను ఆకర్షిస్తున్నాయి.
ఇండియాలో ఎస్‌యూవీ కార్ల మార్కెట్ గత కొంతకాలంగా గణనీయమైన వేగంతో అభివృద్ది చెందుతుంది. ఈ ధోరణి 2020లో మాత్రమే కొనసాగింది, అది కూడా కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ. కొరియా, జపనీస్ కార్ల తయారీ సంస్థలు 2020లో లాంచ్ చేసిన టాప్ 7 ఎస్‌యూవీలు అత్యధిక బుకింగులు, సేల్స్ తో వాహనదారులను ఆకర్షిస్తున్నాయి.
కియా సోనెట్: కొరియా కార్ల తయారీ సంస్థ కియా సోనెట్ కారు కియా సెల్టోస్ లాగానే భారతదేశంలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కియా సోనెట్ లాంచ్ చేసినప్పటి నుండి 11,417 యూనిట్లను విక్రయించగా ఇండియన్ మార్కెట్లో సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తోంది, ఇది కంపెనీ మొత్తం వాల్యూమ్‌లలో దాదాపు సగం. కియా సోనెట్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారతదేశంలో లాంచ్ చేశారు, అయితే కేవలం మూడు నెలల్లోనే అత్యధికంగా అమ్ముడుపోయే ఎస్‌యూవీ కారుగా మారింది.
నిస్సాన్ మాగ్నైట్: జపాన్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ మాగ్నైట్ డిసెంబర్ నెలలోనే సరికొత్తగా ప్రవేశించింది. దీనిని లాంచ్ చేసిన 5 రోజుల్లోనే 5వేలకు పైగా బుకింగ్‌లు, 50 వేలకు పైగా ఎంక్వైరీలను అందుకుంది. 60 శాతం కంటే ఎక్కువ బుకింగ్‌లు మొదటి రెండు వెరీఎంట్స్ ఎక్స్‌వి, ఎక్స్‌వి ప్రీమియంకు, 30 శాతం కంటే ఎక్కువ బుకింగ్‌లు సివిటి ఆటోమేటిక్ వేరియంట్ కోసం వచ్చాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నిస్సాన్ మొత్తం బుకింగ్‌లలో 40 శాతానికి పైగా డిజిటల్ ఛానెళ్ల ద్వారా జరిగాయి. నిస్సాన్ మాగ్నైట్ నాలుగు వెరీఎంట్లలో - XE, XL, XV, XV ప్రీమియం అలాగే రెండు ఇంజన్ ఎంపికలలో అందించబడుతుంది.
also read 4 లక్షల కన్నా తక్కువకే లభిస్తున్న వోక్స్వ్యాగన్, హ్యుందాయ్ కార్లు ఇవే.. ...
మారుతి సుజుకి విటారా బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ : మారుతి సుజుకి విటారా బ్రెజ్జా భారత కార్ల తయారీ సంస్థకు విజయవంతమైనది. ఇది ప్రారంభించినప్పటి నుండి సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో ముందుంది. తాజాగా 5.5 లక్షల సేల్స్ మైలురాయిని చేరుకున్న వేగవంతమైన సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీగా నిలిచింది. మారుతి సుజుకి ఈ ఏడాది ఫిబ్రవరిలో విటారా బ్రెజ్జాకు ఒక చిన్న ఫేస్‌లిఫ్ట్ ఇచ్చింది, కాని పెద్ద మార్పు ఏమిటంటే పెట్రోల్ పవర్‌ట్రెయిన్‌కు మార్చడం, ఇది ఇప్పుడు ఆఫర్‌లో ఉన్న ఏకైక ఇంజన్. మారుతి సుజుకి విటారా బ్రెజ్జా ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్ విత్ డేటైమ్ రన్నింగ్ లాంప్స్ (డిఆర్‌ఎల్), టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, ఎఎమ్‌టి యూనిట్ స్థానంలో హిల్ హోల్డ్ అసిస్ట్‌ను అందిస్తుంది.
హ్యుందాయ్ క్రేటా: హ్యుందాయ్ క్రేటా భారతదేశంలో అత్యంత ప్రియమైన అమ్ముడుపోయే కాంపాక్ట్ ఎస్‌యూవీ. ఈ ఏడాది మార్చిలో ప్రారంభించిన కొత్త 2020 హ్యుందాయ్ క్రేటా దాని పాపులరిటీని పెంచుకుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో క్రేటా బుకింగ్‌లు 1.15 లక్షల మార్కును దాటింది. కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో హ్యుందాయ్ మార్కెట్ వాటా జనవరి-సెప్టెంబర్ కాలంలో 26 శాతం.
మహీంద్రా థార్: కొత్త మహీంద్రా థార్ ఈ ఏడాది అక్టోబర్‌లో లాంచ్ చేశారు. ఇది కేవలం ఒక నెలలోనే 20వేల బుకింగ్‌లను సాధించింది. అయితే డెలివరీ కోసం ఇప్పుడు 5-7 నెలల వేచి ఉండాల్సి ఉంటుంది. మహీంద్రా ఎల్ఎక్స్ వెరీఎంట్ కోసం మాత్రమే బుకింగ్‌లను అంగీకరిస్తోంది, ఎందుకంటే ఇవి చాలా డిమాండ్‌లో ఉన్నాయి. 2020 మహీంద్రా థార్ రెండు వెరీఎంట్లలో అందిస్తుంది. ఒక ఆఫ్-రోడ్-ఫోకస్డ్ ఏఎక్స్ సిరీస్, ఎల్‌ఎక్స్ సిరీస్. ఇందులో పవర్ విండోస్, 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి కొత్త ఫీచర్లను పొందుతారు. గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో మహీంద్రా థార్ 4-స్టార్ రేటింగ్‌ను సాధించింది.
2020 టాటా హారియర్: టాటా హారియర్ కూడా ఈ ఏడాది మార్చిలో కొత్త అప్ డేట్ తో వచ్చింది. కొత్త పనోరమిక్ సన్‌రూఫ్, క్యాబిన్‌లో చిన్న మార్పులు చేసి లాంచ్ చేసింది. కొత్త బాడీ కలర్ ఆప్షన్, డ్యూయల్-టోన్ 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఫియట్-సోర్స్డ్ 2.0-లీటర్ పవర్‌ట్రెయిన్ అప్‌డేట్, హ్యుందాయ్ నుండి సేకరించిన ఆరు-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్ ఆప్షన్ తో వస్తుంది.