4 లక్షల కన్నా తక్కువకే లభిస్తున్న వోక్స్వ్యాగన్, హ్యుందాయ్ కార్లు ఇవే..

మీ బడ్జెట్ 4 లక్షల రూపాయల కన్నా తక్కువ ఉంటే, ఈ ధర పరిధిలో లభించే కొన్ని బెస్ట్ సెకండ్ హ్యాండ్ కార్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఈ వాహనాలన్నీ బిజినెస్ సైట్ లో అమ్ముడవుతున్నాయి.

second hand  cars volkswagen polo and hyundai xcent available under rs 4 lakh rupees

 కొత్త కారు కొనడానికి మీకు బడ్జెట్ లేకపోతే, సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేయవచ్చు. మీ బడ్జెట్ 4 లక్షల రూపాయల కన్నా తక్కువ ఉంటే, ఈ ధర పరిధిలో లభించే కొన్ని బెస్ట్ సెకండ్ హ్యాండ్ కార్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.

ఈ వాహనాలన్నీ బిజినెస్ సైట్ లో అమ్ముడవుతున్నాయి. ఈ బడ్జెట్‌లో మీరు వోక్స్వ్యాగన్ పోలో ఇంకా హ్యుందాయ్ ఎక్సెంట్ వంటి వాహనాలను సులభంగా కొనుగోలు చెయ్యొచ్చు.

వోక్స్వ్యాగన్ పోలో 1.2 టిడిఐ హైలైన్: ఈ 2011 మోడల్ వోక్స్వ్యాగన్ కారు  ప్రతుత్తం అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ కారు డీజిల్ వేరియంట్‌, ఈ వోక్స్వ్యాగన్ పోలో ఇప్పటివరకు 80,566 కిలోమీటర్లు ప్రయాణించింది.

ఈ కారు 22 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. దీని విల్  సైజ్ 15 అంగుళాలు, కారు తెలుపు రంగులో ఉంటుంది, ఈ కారు ధర రూ.3,00,000 లక్షలు.

హ్యుందాయ్ ఎక్సెంట్ ఎస్ 1.2: ఈ 2014 మోడల్ హ్యుందాయ్ కారు  ప్రతుత్తం అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ కారు పెట్రోల్ వేరియంట్, ఈ హ్యుందాయ్ ఎక్సెంట్ కారు గత 6 సంవత్సరాలలో 48,000 కిలోమీటర్లు ప్రయాణించింది. ఈ కారు రూ.3,65,000 కు అమ్ముడవుతోంది. ఈ కారు 19.1 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

గమనిక: బిజినెస్ వెబ్ సైట్ సమాచారం ప్రకారం పైన పేర్కొన్న వాహనాలకు సంబంధించిన సమాచారం. పాత కారును కొనుగోలు చేసేటప్పుడు సర్టిఫికెట్స్, డాక్యుమెంట్స్, కారు కండిషన్ మీరే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వాహనాలన్నీ ఢీల్లీ సర్కిల్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది. వాహన యజమానిని కలవకుండా లేదా వాహనాన్ని తనిఖీ చేయకుండా ఆన్‌లైన్‌లో లావాదేవీలు చేయవద్దు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios