ప్రపంచంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఇంక్, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్ కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించే కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీని ప్రోత్సహించెందుకు 100 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనిని ప్రకటించారు.
ప్రపంచంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఇంక్, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్ కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించే కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీని ప్రోత్సహించెందుకు 100 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనిని ప్రకటించారు.
ఒక నివేదిక ప్రకారం వాతావరణ మార్పులను అరికట్టడానికి, కొన్ని కారణాల వల్ల గ్రహం-వేడెక్కడం ద్వారా ఉద్గారాలను తగ్గించడం ఒక ముఖ్యమైన భాగంగా మారుతోంది, అయితే గాలి నుండి కార్బన్‌ను తొలగించడంతో సహా సాంకేతిక పరిజ్ఞానంలో నేటి వరకు తక్కువ పురోగతి సాధించింది. దీనికి బదులుగా కార్బన్ ఉద్గారాలను తగ్గించడంపై దృష్టి కేంద్రీకరించింది.
ప్రపంచంలో పెరుగుతున్న కార్బన్ ఉద్గారాల దృష్ట్యా ఎలోన్ మస్క్ "కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ఉత్తమ సాంకేతిక పరిజ్ఞానం కోసం నేను 100 మిలియన్లను ప్రైజ్ మని కింద విరాళంగా ఇస్తున్నాను" అంటూ గురువారం సోషల్ మీడియా ట్వీటర్ ద్వారా ట్వీట్ చేశారు. మరో ట్వీట్‌లో, దీని గురించి వచ్చే వారం పూర్తి సమాచారం ఇస్తానని తెలిపారు.
also read కొత్త స్కూటర్ కొనాలని చూస్తున్నారా..? అతి తక్కువ ఈఎంఐతో ఈ స్కూటర్ మీ సొంతం చేసుకోండీ.. ...
సోషల్ మీడియాలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ప్రైజ్ మనిగా గురించిన ప్రజలు నోరెళ్ళబెట్టారు. ఎలోన్ మస్క్ చేసిన ఈ ట్వీట్ కొన్ని గంటలనే 3 లక్షలకు పైగా 'లైక్‌లు', వేల రిట్వీట్లు వచ్చాయి. వీరిలో ఎక్కువ మంది ఎక్కువ చెట్లను నాటాలని ఎలోన్ మస్క్ కి విజ్ఞప్తి చేశారు.
"చెట్టు కంటే మంచి ఆలోచన ఎవ్వరికీ లేకపోతే చెట్లను నాటండి" అని కామెంట్స్ విభాగంలో ఎలోన్ మస్క్ కు ట్విట్టర్ యూజర్లు సూచించారు. ఎలోన్ మాస్క్ ట్వీట్ కి భారత అటవీ అధికారి కూడా రిట్వీట్ చేరారు.
కొద్దిరోజుల క్రితం ఎలోన్ మస్క్ అమెజాన్ సిఇఒ జెఫ్ బెజోస్‌ను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఆవతరించాడు. ఎలోన్ మాస్క్ ఏ విధంగా డబ్బును ఉత్తమంగా విరాళంగా ఇవ్వొచ్చో ఇటీవల ట్విట్టర్ ద్వారా తన అభిమానుల నుండి సలహా తీసుకున్నారు.
2012 లో బిల్ గేట్స్, వారెన్ బఫ్ఫెట్ ప్రారంభించిన' ది గివింగ్ ప్లేడ్జ్'పై ఎలోన్ మస్క్ సంతకం చేశారు. దీనిపై సంతకం చేసిన వ్యక్తి తన జీవితకాలంలో కనీసం సగం ఆస్తిని దానం చేయాలి.
ఈ విరాళం ప్రధానంగా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, పునరుత్పాదక ఇంధన పరిశోధన, పిల్లల పరిశోధన అండ్ మానవ అంతరిక్ష పరిశోధన వంటి రంగాలకు ఉపయోగించబడుతుంది. సెప్టెంబరులో ఫోర్బ్స్ చేసిన ఒక అంచనా ప్రకారం ఎలోన్ మస్క్ ఇప్పటివరకు కేవలం 100 మిలియన్లను విరాళంగా ఇచ్చారు. ఇది వారి మొత్తం ఆస్తులలో 1 శాతం కంటే తక్కువ.
Am donating $100M towards a prize for best carbon capture technology
— Elon Musk (@elonmusk) January 21, 2021
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 22, 2021, 11:27 PM IST