Asianet News TeluguAsianet News Telugu

మారుతి ‘వాగనార్ ఈవీ’తో టియాగో: మహీంద్రా కేయూవీతో టాటా హెచ్2ఎక్స్

సంప్రదాయ వాహనాలను ఉత్పత్తి చేస్తూనే మరోవైపు కర్బన ఉద్గారాల నియంత్రణకు చేపట్టిన విద్యుత్ వాహనాల తయారీలోనూ దూకుడుగా ముందుకు వెళుతున్నది టాటా మోటార్స్.. మారుతి సుజుకి వాగనార్ విద్యుత్ కారు ధీటుగా టియాగో, మహీంద్రా కేయూవీకి ప్రతిగా హెచ్2ఎక్స్ మోడల్ విద్యుత్ కార్లు రూపుదిద్దుకుంటున్నాయి. 
 

Tata Motors plans to drive in more electric cars soon
Author
Mumbai, First Published Apr 16, 2019, 2:04 PM IST

ముంబై: విద్యుత్ వాహనాల కోసం ప్రభుత్వం ఆహ్వానించిన బిడ్లను మహీంద్రా అండ్ మహీంద్రా కైవసం చేసుకున్న తర్వాత మరో ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్‌లో వేడి పెరిగింది. ప్రత్యేకించి ప్రయాణికుల వాహనాల విభాగాన్ని మరింత విస్త్రుతం చేయాలని టాటా మోటార్స్ నిర్ణయించింది. రూ.15 లక్షల్లోపు ధర కల టాటా మోటార్స్ కార్లలో ఇప్పటి వరకు వస్తున్న మోడల్స్ ఆల్ట్రోజ్ ఈవీ, స్మాల్ ఎస్‌యూవీ ఈవీ హెచ్2ఎక్స్, టియాగో, టైగోర్ ఈవీ వాహనాలను విపణిలోకి తేవాలని టాటా మోటార్స్ తలపోస్తున్నది. 

టాటా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ గుంటేర్ బుచెక్ మాట్లాడుతూ తమ సంస్థ విద్యుత్ వాహనాలను విపణిలోకి తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉన్నదని చెప్పారు. ఆల్ఫా, ఒమెగా మోడల్ కార్లు పూర్తిగా విద్యుత్ వినియోగ కార్లు కానున్నాయన్నారు. ప్రత్యేకించి టైగోర్, టియాగో విద్యుత్ కార్ల తయారీ కోసం ఉన్నత స్థాయిలో చర్యలు చేపట్టినట్లు చెప్పారు. 

ప్రూఫ్- ప్రొటెక్టెడ్ ఆర్కిటెక్చర్ సంప్రదాయ ఇంధన వినియోగ ఇంజిన్, బ్యాటరీ ఆధారిత (విద్యుత్ వినియోగ) ఇంజిన్‌ను అందజేస్తారని టాటా మోటార్స్ తెలిపింది. టాటా మోటార్స్ టియాగో విద్యుత్ కారు.. ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనున్న వాగనార్ విద్యుత్ కారుతో తలపడనున్నది. ఇక టైగోర్ విద్యుత్ కారు.. ఫ్లీట్ సెగ్మెంట్‌లో ఆల్టర్నేటివ్‌గా పని చేస్తుంది. 

ఇక టాటా ఆల్ట్రోజ్ విద్యుత్ కారు.. విద్యుత్ పవర్ ట్రైన్ తో కూడిన ఆస్పిరేషనల్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కారు కానున్నది. ఆల్ట్రోజ్ కారు ప్రీమియం ట్రాన్స్ పోర్ట్ కూడా అందజేస్తుందని టాటా మోటార్స్ ఎండీ బుచెక్ తెలిపారు. 

హెచ్2ఎక్స్ లేదా హార్న్ బిల్ వంటి స్మాల్ ఎస్‌యూవీ కారు తాజాగా టాటా ఆవిష్కరించనున్న విద్యుత్ వినియోగ కార్ల జాబితాలో చేరనున్నది. ఇది మహీంద్రా కేయూవీ విద్యుత్ కారుతో తలపడనున్నది. ఒకసారి చార్జింగ్ పెడితే 200-230 కిలోమీటర్ల దూరం ప్రయాణించే వీలు గల కార్ల తయారీపై కేంద్రీకరించామని టాటా మోటార్స్ ఎండీ బుచెక్ తెలిపారు. 

నూతన తరం వాహనాల అనుసంధాన సొల్యూషన్ ప్లాట్ ఫామ్ కోసం టాటా మోటార్స్ క్రుషి చేస్తోంది. ఈ ప్లాట్ ఫామ్.. టాటా మోటార్స్ విద్యుత్ వాహనాల్లో సమగ్ర భాగం కానున్నది. కేంద్ర భారీ పరిశ్రమలశాఖ నుంచి 60 శాతం విద్యుత్ బస్సుల సరఫరా కాంట్రాక్ట్‌ను టాటా మోటార్స్ గెలుచుకున్నది. దేశవ్యాప్తంగా 255 విద్యుత్ వినియోగ బస్సులను టాటా మోటార్స్ పంపిణీ చేయాల్సి ఉంటుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios