పండుగ సీజన్ సమీపిస్తున్న తరుణంలో దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ వాహనాల సేల్స్  పెంచుకునేందుకు, కస్టమర్లను ఆకర్శించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇందుకోసం టాటా కార్లపై  మరోసారి  భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.

ఈ డిస్కౌంట్ ఆఫర్లు సెప్టెంబర్ 30, 2020 వరకు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా బీఎస్-6 ఇంజన్ టాటా హ్యారియర్ ఎస్‌యూవీ కారుపై ఏకంగా 80 వేల రూపాయల వరకు రాయితీ ఇస్తోంది.

అంతేకాకుండా ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలు, కన్స్యూమర్ స్కీమ్,  కార్పొరేట్ డిస్కౌంట్లు ఉన్నాయి. టాటా నెక్సాన్, టైగోర్, టియాగో,  హారియర్ బీఎస్6 కార్ల పై మాత్రమే డిస్కౌంట్లను అందిస్తోంది.  

also read ఉత్పత్తి నిలిపివేసిన తరువాత హార్లే-డేవిడ్సన్ తో హీరో మోటోకార్ప్‌తో భారీ డీల్.. ...

కస్టమర్లకు రూ.40 వేల ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు కార్పొరేట్ డిస్కౌంట్‌గా రూ .15 వేల వరకు ప్రయోజనం పొందవచ్చని నివేదించింది. టాటా హారియర్ XZ +, XZA +, డార్క్ ఎడిషన్ మోడల్ మినహా అన్ని మోడళ్లకు ఈ ఆఫర్ వర్తిస్తాయి.

టాటా హారియర్ 2-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది, 170 పిఎస్ పవర్, 350 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ ఆటోమేటిక్,  మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్  ఆప్షన్స్ తో వస్తుంది. టాటా హారియర్ ఎస్‌యూవీ ధర 13.84 లక్షలు (ఎక్స్ షోరూం).