Asianet News TeluguAsianet News Telugu

ఉత్పత్తి నిలిపివేసిన తరువాత హార్లే-డేవిడ్సన్ తో హీరో మోటోకార్ప్‌తో భారీ డీల్..

ఇండియాలో స్థానిక తయారీని నిలిపివేసిన తరువాత యు.ఎస్. సంస్థ ఐకానిక్ హార్లే-డేవిడ్సన్ బైకులను భారతదేశంలో విక్రయించడానికి ఈ డీల్ ద్వారా వీలు కల్పిస్తుంది,  మిల్వాకీకి చెందిన సంస్థ గురువారం రోజున  "మా సేల్స్ నిలిపివేసి, భారతదేశంలోని తయారీ కర్మాగారాన్ని మూసివేస్తున్నట్లు తెలిపింది

HarleyDavidson Close To Deal With Indias Hero MotoCorp After Stopping Local Manufacturing: Report
Author
Hyderabad, First Published Sep 26, 2020, 3:03 PM IST

హార్లే-డేవిడ్సన్ ఇంక్ భారతదేశపు హీరో మోటోకార్ప్‌తో డిస్ట్రిబ్యూషన్ డీల్ కోసం చర్చలు జరుపుతోంది. ఇండియాలో స్థానిక తయారీని నిలిపివేసిన తరువాత యు.ఎస్. సంస్థ ఐకానిక్ హార్లే-డేవిడ్సన్ బైకులను భారతదేశంలో విక్రయించడానికి ఈ డీల్ ద్వారా వీలు కల్పిస్తుంది,  

మిల్వాకీకి చెందిన సంస్థ గురువారం రోజున  "మా సేల్స్ నిలిపివేసి, భారతదేశంలోని తయారీ కర్మాగారాన్ని మూసివేస్తున్నట్లు తెలిపింది, ప్రపంచంలోని అతిపెద్ద మోటారుసైకిల్ మార్కెట్‌ అయిన ఇండియా నుండి తప్పుకుంటున్నట్లు వెల్లడించింది.

 హార్లే-డేవిడ్సన్ బైక్‌లను భారతీయ కంపెనీ సింగల్ డిస్ట్రిబ్యూటర్ గా  దిగుమతి చేసుకోవడానికి, విక్రయించడానికి హార్లే-డేవిడ్సన్ హీరో మోటోకార్ప్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలిపాయి. భారతదేశంలో హార్లే-డేవిడ్సన్ బైక్‌లకు మాస్టర్ డిస్ట్రిబ్యూటర్‌గా హీరోమోటోకార్ప్‌ ఉంటుంది.

చర్చలు ప్రైవేట్‌గా ఉన్నందున వివరాలను వెల్లడించడానికి నిరాకరించారు. 300-600 సిసి ఇంజన్ సామర్థ్యంతో ఏదైనా ఒక హార్లే-డేవిడ్సన్ బైక్‌కి హీరోమోటోకార్ప్‌ కాంట్రాక్ట్ తయారీదారుడిగా ఊండడానికి చర్చలు కొనసాగుతున్నాయి.

ఈ ఒప్పందం  ఆర్థిక వివరాలు పై స్పష్టమైన అధికారిక సమాచారం లేదు. హీరోమోటోకార్ప్‌ తో చర్చల గురించి అడిగినప్పుడు హార్లే-డేవిడ్సన్ ప్రతినిధి మాట్లాడుతూ "పుకార్లు లేదా హాగానాలపై" కంపెనీ వ్యాఖ్యానించలేదని చెప్పారు.  

భారతదేశంలో తన వ్యాపార నమూనాను మార్చడం, వినియోగదారులకు సేవలను కొనసాగించడానికి ఉత్తమమైన ఎంపికలను అంచనా వేయడం అవసరం" అని తెలిపింది. అమ్మకాలలో భారతదేశంల అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్ మార్కెట్ ఊహాగానాలపై వ్యాఖ్యానించలేదని తెలిపింది.

మార్చి 2020 తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో హీరో మోటోకార్ప్  6.4 మిలియన్ ద్విచక్ర వాహన స్కూటర్లు, బైకులను  ఉత్పత్తి చేసింది, ఇది భారతదేశం మొత్తం ఉత్పత్తిలో మూడవ వంతు. ఆ కాలంలో  హార్లే-డేవిడ్సన్ కేవలం 4,500 బైకులను మాత్రమే తయారు చేసింది.

తయారీని నిలిపివేయాలని హార్లే-డేవిడ్సన్ తీసుకున్న నిర్ణయం భారతదేశంలోని  ఆటోమోటివ్ రంగంలో మరో ప్రధాన సంస్థ తొలగింపు సూచిస్తుంది. స్థానిక ఉత్పత్తిని పెంచడానికి విదేశీ సంస్థలను ఆహ్వానిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇది ఒక  విధంగా ఎదురుదెబ్బ. హీరో మోటోకార్ప్ సాధారణంగా 200 సిసి కంటే తక్కువ ఇంజన్ సామర్థ్యంతో బైకులను విక్రయించనుంది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios