Asianet News TeluguAsianet News Telugu

టాటా మోటార్స్ మరో అధ్బుతమైన ఘనత.. అనుపమ్ ఖేర్ ద్వారా సక్సెస్ స్టోరీ వీడియో విడుదల..

చాలా కాలంగా వాణిజ్య వాహనాలపై ఆధిపత్యం వహించిన టాటా గ్రూప్ సంస్థ ఈ మైలురాయి గురించి ప్రత్యేక వీడియోను కూడా విడుదల చేసింది, ఇందులో హీరో అనుపమ్ ఖేర్ టాటా మోటార్స్ గత దశాబ్దాల చరిత్రను వివరించారు. 

tata motors india sales 40 lakh units of car anupam kher shares story of success
Author
Hyderabad, First Published Nov 20, 2020, 11:34 AM IST

కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ ఆటో కంపెనీ భారతదేశంలో 4 మిలియన్ కార్లను అమ్మి రికార్డు సృష్టించింది. చాలా కాలంగా వాణిజ్య వాహనాలపై ఆధిపత్యం వహించిన టాటా గ్రూప్ సంస్థ ఈ మైలురాయి గురించి ప్రత్యేక వీడియోను కూడా విడుదల చేసింది, ఇందులో హీరో అనుపమ్ ఖేర్ టాటా మోటార్స్ గత దశాబ్దాల చరిత్రను వివరించారు.

ఈ వీడియోలో అనుపమ్ ఖేర్ 1945 నుండి ఇప్పటి వరకు కథను వివరించాడు. టాటా మోటార్స్ సంస్థ భారతదేశంలో తన ఉనికిని ఎలా క్రమంగా పెంచుకుంటుందో ఈ వీడియో ద్వారా వివరించింది. భద్రతా లక్షణాల పరంగా గత కొన్నేళ్లుగా మెరుగుపడిన టాటా మోటార్స్, ఈ వీడియోలో దాని అనేక ఫీచర్ల గురించి తెలిపింది.

ఇది మాత్రమే కాదు టాటా మోటార్స్ సంస్థ ప్రస్తుతం ఉన్న అనేక కార్ల గురించి కూడా సమాచారం ఇచ్చింది. టాటా ఇటీవలి కాలంలో లాంచ్ చేసిన టాటా టియాగో, టైగోర్, నెక్సాన్, ఆల్ట్రోజ్, హారియర్ వంటి కార్లను విడుదల చేసింది. టాటా మోటార్స్ గత దశాబ్దంలో ప్రయాణీకుల వాహనాల్లో తన ఉనికిని వేగంగా నమోదు చేసినట్లు తెలిపింది.

also read ప్రభుత్వం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ కార్ల అమ్మకాల పై 2030 నుండి బ్యాన్..

ముఖ్యంగా కార్ల విషయంలో సంస్థ తన గుర్తింపును బలపరిచింది. కంపెనీ ప్రస్తుతం కార్ మార్కెట్ వాటా పరంగా మూడవ స్థానంలో ఉంది, మారుతి సుజుకి, హ్యుందాయ్ తరువాత స్థానంలో ఉన్నాయి.

 గత కొన్నేళ్లుగా కంపెనీ కార్లపై తన సాంకేతికతను మెరుగుపరిచింది, అలాగే లోపలి భాగంలో మార్పులు చేసింది. టాటా టియాగో కారు ప్రజలను ఎంతో  ఆకర్షించింది. టియాగో కారు భద్రత, ఫిఃచర్స్ నుండి మైలేజీకి వరకు మెరుగుపడింది.

ఇది మాత్రమే కాదు, ఇటీవల లాంచ్ చేసిన టాటా ఆల్ట్రోజ్ భద్రత విషయంలో కూడా అద్భుతమైనది, అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో 5వ స్థానంలో ఉంది. ఇది కాకుండా, టాటా నెక్సాన్ కూడా వినియోగదారులను ఎంతో ఆకర్షించింది.

ఇప్పటి వరకు కంపెనీ టాటా నెక్సాన్‌ 1.5 లక్షల యూనిట్లు విక్రయించింది. ఇది కాకుండా టియాగో కూడా మూడు లక్షల యూనిట్ల సేల్స్ మార్క్  దాటింది. టాటా మోటార్స్ ఎస్‌యూవీ కారు హారియర్ ఇప్పుడు వినియోగదారుల నుండి మంచి స్పందన పొందుతోంది.


 

Follow Us:
Download App:
  • android
  • ios