లండన్: వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి బ్రిటన్  కీలకమైన  ప్రకటన చేయబోతోంది. 2030 నుంచి పెట్రోల్, డీజిల్ కార్ల అమ్మకాలను నిషేధించాలని యు.కె ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని నివేదికల ప్రకారం బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ త్వరలో ఈ విషయంపై  అధికారిక  ప్రకటన చేయనున్నారు.

గ్రీన్ ఇండస్ట్రియల్ రివొల్యూషన్  10 పాయింట్ల ప్రణాళికలో ఈ నిర్ణయం భాగమని తెలిపింది. యు.కెలో ఈ నిర్ణయం అమలు చేయడం వల్ల ఆటోమొబైల్ మార్కెట్లో భారీ మార్పు తేనుంది. 

 ఈ నిర్ణయం వల్ల సుమారు 2.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని యుకె ప్రభుత్వం భావిస్తోంది. గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ గతంలోనే  2030 నుండి దీనిని అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. వచ్చే వారం పర్యావరణ విధానం ప్రసంగంలో దీనిని ప్రకటించవచ్చు. 

also read ఫెస్టివల్ సీజన్ లో హీరో మోటోకార్ప్ రికార్డ్ సేల్స్.. గత ఏడాదితో పోల్చితే 103 శాతం అధికం.. ...

విస్తృత ప్రణాళికల కోసం బ్రిటిష్ ప్రీమియర్ 12 బిలియన్ పౌండ్లను (13.4 బిలియన్ యూరోలు, 15.9 బిలియన్ డాలర్లు) కేటాయించింది, దీని వల్ల 25 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుందని, 2050 నాటికి యూ‌కే కార్బన్ న్యూట్రల్ లక్ష్యాన్ని చేరుకోవడంలో సహాయపడుతుందని  బ్రిటిష్ ప్రధాన మంత్రి భావిస్తున్నారు.

సున్నా-ఉద్గార ప్రజా రవాణా, సున్నా-ఉద్గార విమానాలు, నౌకలపై పరిశోధనతో పాటు, సైక్లింగ్, వాకింగ్ "మరింత ఆకర్షణీయంగా" చేయడంలో ఈ పెట్టుబడులు పెట్టనున్నారు. కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీలో బ్రిటన్‌ను ప్రపంచ లీడర్ గా, లండన్ నగరాన్ని గ్రీన్ ఫైనాన్స్ గ్లోబల్ సెంటర్ గా మార్చడానికి ఈ ప్రణాళికలు రూపొందించారు.

చిన్న-మధ్య తరహా అణు కర్మాగారాలను, కొత్త అధునాతన మాడ్యులర్ రియాక్టర్లను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం 525 మిలియన్ పౌండ్లను ఖర్చు చేయనుంది."నా 10-పాయింట్ల ప్రణాళిక వందల వేల హరిత ఉద్యోగాలను సృష్టిస్తుంది" అని జాన్సన్ బ్లూప్రింట్‌ను ప్రచురించడానికి ముందు ఒక ప్రకటనలో తెలిపారు.