ముంబయి: టాటా మోటర్స్ కొత్త ప్రీమియం ఫీచర్లతో టాటా నెక్సాన్‌కు చెందిన ఎక్స్‌ఎం (ఎస్) వేరియంట్‌ను రూ .8.36 లక్షల (ఎక్స్‌-షోరూమ్) ధరకు ప్రారంభిస్తున్నట్లు టాటా మోటార్స్ బుధవారం ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ రెండు వెరీఎంట్లలో లభించే నెక్సాన్ మాన్యువల్, ఎఎమ్‌టి అనే రెండు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో వస్తుంది.

కొత్తగా ఇప్పుడు ఎక్స్‌ఎమ్ (ఎస్) వేరియంట్‌లో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో రానుంది. దీని ప్రారంభ ధర రూ .8.36 లక్షలకు (ఎక్స్‌-షోరూమ్ ఢీల్లీ) అందిస్తోంది. నెక్సాన్ ఎక్స్‌ఇ బేస్ వేరియంట్ ధర రూ .6.99 లక్షలు (ఎక్స్‌-షోరూమ్) నుంచి టాప్ వేరియంట్ రూ .12.70 లక్షలు (ఎక్స్‌షోరూమ్) వద్ద లభిస్తుంది.

ఎక్స్‌ఎం (ఎస్) వేరియంట్‌లో ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లతో కూడిన ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు, డ్రైవర్ ఇంకా కో-డ్రైవర్ ఎయిర్‌బ్యాగులు, హిల్ హోల్డ్ కంట్రోల్, హర్మన్, మల్టీ డ్రైవ్ మోడ్‌  కనెక్ట్‌నెక్స్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి.

టాటా నెక్సాన్ హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, మహీంద్రా ఎకోస్పోర్ట్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ వంటి ఇతర బి-సెగ్మెంట్ ఎస్‌యూవీలతో ఈ కారు పోటీపడుతుంది.

also read కే‌జి‌ఎఫ్ బైక్ స్టయిల్లో కొత్త ఎలక్ట్రిక్ బైక్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 100కి.మీ మైలేజ్.. ...

టాటా మోటార్స్ మార్కెటింగ్, ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్ (పివిబియు) హెడ్ వివేక్ శ్రీవత్స మాట్లాడుతూ “టాటా మోటార్స్‌కు నెక్సాన్ కారు ఎప్పుడూ గర్వకారణం. ఇది 2018లో భారతదేశంలో గ్లోబల్ ఎన్‌సిఎపి మొట్టమొదటి ఫైవ్ స్టార్ రేటెడ్ కారుగా అవతరించడం ద్వారా మమ్మల్ని భద్రత ఫ్లాగ్ బేరర్‌గా స్థాపించింది.

పరిశ్రమ, మీడియా, కస్టమర్లు కారు రూపకల్పన ఇంకా డ్రైవింగ్ డైనమిక్స్ గురించి మెచ్చుకున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో మా ‘న్యూ ఫరెవర్’ రేంజ్ వాహనాలను ప్రారంభించడంతో మారుతున్న కస్టమర్ల డిమాండ్లతో మా ఉత్పత్తులను తాజా అప్ డేట్ తో ఉంచుతామని మేము హామీ ఇచ్చాము.

"మా నిబద్ధతను కొనసాగిస్తూ, నెక్సాన్ ఎక్స్‌ఎమ్ (ఎస్) ను ప్రారంభించినందుకు మేము సంతోషిస్తున్నాము. ఇప్పుడు మా కస్టమర్లు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి అత్యుత్తమ ఫీచర్స్ బడ్జెట్ ధరకె లభిస్తుంది.

మా నెక్సాన్ రేంజ్ కారుకు అదనంగా మేము మా కస్టమర్లకు ఆకర్షణీయమైన ధరకే ప్రీమియం డ్రైవింగ్ ఆనందం & అత్యాధునిక ఫీచర్స్ అందిస్తాము, తద్వారా మా ఉత్పత్తులు అందరికీ అందుబాటులో ఉంటాయి. ” అని అన్నారు.