మోడిఫైడ్ డీసీ డిజైన్ బీఎండబ్ల్యూ ‘ఐ8’ రైడింగ్‌లో సచిన్ ఇలా!
మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ అంటే తెలియని వారు ఉండరు. క్రీడా రంగ చరిత్రలో తనకంటూ చరిత్ర స్రుష్టించిన మాస్టర్ బ్లాస్టర్ క్రికెట్‌లో మర్చిపోలేని ఇన్నింగ్స్ చేసిన ఘనత సాధించాడు. సాఫ్ట్‌గా మాట్లాడే సచిన్ టెండూల్కర్‌కు కార్లంటే ఎంతో మోజు మరి.
ముంబై: మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ అంటే తెలియని వారు ఉండరు. క్రీడా రంగ చరిత్రలో తనకంటూ చరిత్ర స్రుష్టించిన మాస్టర్ బ్లాస్టర్ క్రికెట్‌లో మర్చిపోలేని ఇన్నింగ్స్ చేసిన ఘనత సాధించాడు. సాఫ్ట్‌గా మాట్లాడే సచిన్ టెండూల్కర్‌కు కార్లంటే ఎంతో మోజు మరి.
మాస్టర్ బ్లాస్టర్ ఖాతాలో జత కలిసిన కార్ల సంఖ్య కాసింత పొడుగ్గానే ఉంటుంది మరి. బీఎండబ్ల్యూ ఎక్స్5ఎం, నిస్సాన్ జీటీ-ఆర్, బీఎండబ్ల్యూ ఎం5, మెర్సిడెజ్ బెంజ్ సీ 63, ఏఎంజీ, ఫెర్రారీ 360 మొడెనా కార్లు ఆయన సొంతం.
ఇటీవలే విపణిలోకి అడుగు పెట్టిన మోడిఫైడ్ డీసీ డిజైన్ బీఎండబ్ల్యూ ఐ8 స్పోర్ట్స్ కారును అందరి కళ్లూ ఆకర్షిస్తాయి. బీఎండబ్ల్యూ బ్రాండ్ అంబసిడార్‌గా వ్యవహరిస్తున్న సచిన్ టెండూల్కర్ కూడా అందుకు మినహాయింపు కాదు. ఇంకేముంది బీఎండబ్ల్యూ ‘ఐ8’ కారును ఎంతో ఇష్టపడి కొనుగోలు చేశారు. రెగ్యులర్ బీఎండబ్ల్యూ ‘ఐ8’ కారుతో పోలిస్తే మోడిఫైడ్ డిజైన్ ఐ8 మోడల్ కారు ఆకర్షణీయంగా ఉంటుంది.
మాస్టర్ బ్లాస్టర్ ‘వైట్ అండ్ బ్లూ పెయింట్’వేరియంట్ బీఎండబ్ల్యూ ఐ8 కారును కొనుగోలు చేశారు. అయితే ఈ కారు షేడ్ ఆఫ్ రెడ్ అండ్ వైట్ విత్ బ్లాక్ అస్సెంట్స్ లోనూ లభిస్తుంది. కస్టమ్ గ్రిల్లె, న్యూ బంపర్స్, లార్జర్ ఎయిర్ డామ్స్, వెంటెడ్ బంపర్ ప్యానెల్స్, న్యూ ఫ్రంట్ బంపర్ స్ప్లిట్టర్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
కేవలం 4.4 సెకన్లలోనే 100 కి.మీ. వేగం అందుకునే బీఎండబ్ల్యూ ‘ఐ8’ మోడల్ కారు 1.5 లీటర్, 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. 231 బీహెచ్పీ, 320 ఎన్ఎం పీక్ టార్చి కలిగి ఉంటుంది. 131 బీఎచ్పీ, 250 ఎన్ఎం సామర్థ్యం గల విద్యుత్ మోటార్ ఇంజిన్ కూడా అందుబాటులో ఉన్నది.