ఆ వాహన సంస్థలో 15 వేల ఉద్యోగాల కోత..!

వాహన రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం ఆ పరిశ్రమలో పని చేసే ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. గత కొన్నాళ్లుగా కొనుగోళ్లు లేక డీలా పడ్డ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ ప్రపంచ వ్యాప్తంగా 15వేల ఉద్యోగాల కోతకు సిద్ధమైంది.  
 

Renault to restructure factories, confirms 15,000 job cuts

అసలే ఆర్థిక మందగమనం.. ఆపై కరోనా మహమ్మారితో నెలకొన్న ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ సంస్థ పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా 15,000 ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. రానున్న మూడేళ్లలో 200 కోట్ల యూరోల మేర ఖర్చులు తగ్గించుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 

ఈ మేరకు ఫ్రాన్స్ కు చెందిన ఆటోమొబైల్ మేజర్ రెనాల్ట్ ఉద్యోగాల తొలగింపు విషయమై శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. తాజా నిర్ణయంతో ఫ్రాన్స్​లో అత్యధికంగా 4,600 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారని రెనాల్ట్  ప్రకటించింది. 

ఫ్రాన్స్​ మినహా ఇతర దేశాల్లో 10 వేలకు పైగా మందికిపైగా ఉద్యోగులను తగ్గించుకోనున్నట్లు రెనాల్ట్ వెల్లడించింది. ఉద్యోగాల కోత తర్వాత 2019లో 4 మిలియన్​ యూనిట్లుగా ఉన్న కంపెనీ ఉత్పాదక సామర్థ్యాన్ని 2024 నాటికి 3.3 శాతానికి తగ్గించుకోనున్నట్లు రెనాల్ట్ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా రెనాల్ట్ సంస్థలో 1,80,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.

also read ఆటోమొబైల్ సేల్స్ పై లాక్‌డౌన్‌ భారీ ప్రభావం.. క్రిసిల్‌ రిసెర్చ్‌ ఆందోళన

10 శాతం సిబ్బందిని తగ్గించుకోనున్నట్లు రెనాల్ట్ ప్రకటించింది. ఈ సంస్థలో ఫ్రాన్స్ ప్రభుత్వ వాటా 15 శాతం ఉంటుంది. ఈ కార్ల తయారీ సంస్థకు పారిస్ నగరానికి సమీపాన గల ఫ్లిన్స్ లోని ప్రొడక్షన్ యూనిట్‌లో జోయ్ మోడల్ విద్యుత్ కార్లను తయారు చేస్తుంది. 

విడి భాగాల తయారీ సంస్థలతోపాటు రెనాల్ట్ తన ఆరు ప్రొడక్షన్ యూనిట్ల నిర్వహణను సమీక్షించనున్నది. రెనాల్ట్ సంస్థలో జపాన్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ కూడా భాగస్వామిగా ఉన్నది. కరోనా ప్రభావంతో నిస్సాన్ సైతం ఆర్థికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా 2019 ఆర్థిక ఫలితాల్లో దశాబ్ది క్రితం నాటి నష్టాలను ప్రకటించింది. 

ఇంజినీరింగ్ విభాగంలో సబ్ కాంట్రాక్టులు, విడి భాగాల వాడకం, రొమేనియా, మొరాకోల్లో విస్తరణ ప్రణాళికలకు రెనాల్ట్ పుల్ స్టాఫ్ పెట్టనున్నది. ప్రపంచ వ్యాప్తంగా గేర్ బాక్స్ తయారీని నిలిపివేయనున్నది. 2024 వరకు 40 లక్షల కార్ల తయారీ లక్ష్యాన్ని 33 లక్షలకు కుదించుకున్నది. చిన్న కార్లు లేదా విద్యుత్ కార్ల తయారీపైనే రెనాల్ట్ కేంద్రీకరించనున్నది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios