Asianet News TeluguAsianet News Telugu

ఆటోమొబైల్ సేల్స్ పై లాక్‌డౌన్‌ భారీ ప్రభావం.. క్రిసిల్‌ రిసెర్చ్‌ ఆందోళన

మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు ఇప్పటికే ఏడాది కాలానికి పైగా వెహికల్స్ అమ్మకాలు సరిగ్గా లేక ఆటోమొబైల్ రంగం ఇక్కట్ల పాలవుతున్నది. తాజాగా కరోనా ప్రభావంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రయాణ వాహనాల విక్రయాలు 24-26 శాతం పడిపోతాయని, ద్విచక్ర వాహనాల అమ్మకాలు 21-23 శాతానికి క్షీణిస్తాయని క్రిసిల్ రీసెర్చ్ అంచనా వేసింది. 

Automobile industry to see double-digit sales decline in FY21: Crisil Research
Author
Hyderabad, First Published May 30, 2020, 12:14 PM IST

న్యూఢిల్లీ: కరోనాను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా రెండు నెలలుగా అమలుచేసిన లాక్‌డౌన్‌ ప్రభావం భారీగానే ఉండనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆటోమొబైల్ పరిశ్రమ రెండంకెల అమ్మకాల క్షీణతకు దారి తీస్తుందని క్రిసిల్ రీసెర్చ్ శుక్రవారం తన నివేదికలో పేర్కోంది.

పాసింజర్‌, కమర్షియల్‌ వాహన అమ్మకాలు 2010 ఆర్థిక సంవత్సర స్థాయికి దిగిరావడంతో మొత్తం అమ్మకాల పరిమాణం కొన్నేళ్ల కనిష్టాన్ని పడిపోయే అకాశం ఉందని రీసెర్చ్‌ సంస్థ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య వాహన అమ్మకాలు 26-28శాతం, పాసింజన్‌ వాహనాల విక్రయాలు 24-26శాతం క్షీణించే అవకాశం ఉందని క్రిసిల్  అంచనా వేసింది.

అయితే ట్రాక్టర్‌ అమ్మకాలు క్షీణత మాత్రం స్వల్పంగా 7-9శాతంగా మాత్రమే ఉండొచ్చని క్రిసిల్ సంస్థ తెలిపింది. లాక్‌డౌన్‌ విధింపు, పొడగింపులతో పట్టణ ఆదాయలు భారీ క్షీణించాయని క్రిసెల్‌ రీసెర్చ్‌ పర్సన్‌ హతల్‌ గాంధీ అభిప్రాయపడ్డారు.

also read ఎస్‌యూవీ కార్ల ఉత్పత్తి టార్గెట్: హిందూపురం ప్లాంట్‌లో 54 మిలియన్ల డాలర్ల పెట్టుబడులు..

మొత్తం 26 వేల కంపెనీల్లో రూ.7లక్షల కోట్ల ఉద్యోగ వ్యయాలున్నట్లు తాము నిర్థారించామని, దీంతో అటో పరిశ్రమలో ఉద్యోగ నష్టాలు లేదా వేతన కోతలకు మరింత ఆస్కారం ఉందని హతల్ గాంధీ పేర్కొన్నారు. సప్లై నుంచి మొదలైన కష్టాలు అతి తొందర్లో డిమాండ్‌కు వైపు విస్తరిస్తుందని క్రిసిల్ అంచనా వేసింది. ఉద్యోగ భయాలు, వేతనాల కోతతో వినియోగదారుల కొనుగోళ్ల సెంటిమెంట్‌ తగ్గిందని రీసెర్చ్‌ సంస్థ పేర్కొంది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసికంలో పండుగ సీజన్‌ సందర్భంగా డిమాండ్‌ కొంత రివకరీ అయ్యే అవకాశం ఉందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ద్విచక్ర వాహనాలకు అమ్మకాలు పెరగచ్చని పెరగవచ్చని క్రిసిల్ అంచనా వేసింది.

రబీ ఉత్పత్తులు పెరగచ్చనే అవుట్‌లుక్‌తో పాటు సాధారణ స్థాయిలో వర్షపాతం నమోదు కావచ్చనే అంచనాలతో ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ట్రాక్టర్లకు డిమాండ్‌ పెరగవచ్చని క్రిసిల్ తెలిపింది. అయితే పాసింజర్‌, కమర్షియల్‌ వాహన విక్రయాలు నాలుగో త్రైమాసికంలో పెరగవచ్చని క్రిసిల్ తెలిపింది.  

Follow Us:
Download App:
  • android
  • ios